Krishna Grandson Movie| కృష్ణ మనువడి సినిమాలో విలన్ గా మోహన్ బాబు !

విధాతMohan Babu villain: టాలీవుడ్(Tollywood)లో మరో సినీ వారసుడి ఆరంగేట్రం సినిమా ఆసక్తి రేపుతుంది. దివంగత సూపర్ స్టార్ ఘట్టమనేని కృష్ణ మనువడు(Krishna Grandson), రమేష్ బాబు తనయుడు జయకృష్ణ(Jayakrishna) హీరోగా ఎంట్రీ(debut) ఇవ్వబోతున్న సినిమా టాలీవుడ్ లో హాట్ టాపిక్ గా మారింది. ఆర్.ఎక్స్ 100′ ఫేమ్ అజయ్ భూపతి(Ajay Bhupathi) దర్శకత్వంలో రూపుదిద్దుకోనున్న ఈ సినిమా అక్టోబరు 15న లాంఛనంగా ప్రారంభం కానుంది. బాలీవుడ్ నటి రవీనాటాండన్(Raveena Tandon) కుమార్తె (Daughter)రాషా తడానీ(Rasha Thadani) కూడా ఈ సినిమాలో కథనాయికగా తెలుగు ఇండస్ట్రీకి పరిచయం కాబోతుంది. ఈ చిత్రం కోసం ‘శ్రీనివాస మంగాపురం’ అనే టైటిల్ పరిశీలనలో ఉంది. ప్రేమకథలో యాక్షన్, ఫ్యాక్షన్ వంటి అంశాలతో నిర్మాణం జరుపుకోనున్న ఈ సినిమాలో క్లైమాక్స్ స్టన్నింగ్ ఉండబోతుందని టాక్.
వైజయంతీ మూవీస్, ఆనంది ఆర్ట్స్ సంస్థలు ఈ సినిమాను నిర్మించనున్న ఈ చిత్రానికి సంబంధించి ప్రస్తుతం ఇతర తారాగణం, సాంకేతిక నిపుణుల ఎంపిక జరుగుతోంది. అయితే ఈ సినిమాలో మరో కీలక పాత్ర కోసం సీనియర్ నటుడు మంచు మోహన్ బాబు(Mohan Babu)ను సంప్రదించినట్లుగా తెలుస్తుంది. కొత్త హీరోహీరోయిన్లతో కూడిన ఈ సినిమాలో ప్రతినాయకుడి(Villain Role)గా బిగ్ స్టార్ ఎంచుకోవాలన్న ఆలోచనతో మోహన్ బాబును విలన్ పాత్ర కోసం చిత్రబృందం సంప్రదించినట్లుగా సమాచారం. ఈ పాత్రలో నటించడానికి మోహన్ బాబు కూడా అంగీకరించారన్న టాక్ వినిపిస్తుంది. అదే జరిగితే ఈ సినిమా మరింత క్రేజీ ప్రాజెక్టుగా నిలవడం ఖాయంగా కనిపిస్తుంది.