Mowgli Teaser : ‘మోగ్లీ 2025’ సినిమా టీజర్ విడుదల

రోషన్ కనకాల హీరోగా, సందీప్ రాజ్ దర్శకత్వంలో రూపొందిన ‘మోగ్లీ 2025’ సినిమా టీజర్ విడుదలైంది. ఫారెస్ట్ నేపథ్యంతో సాగే ఈ యాక్షన్ లవ్ స్టోరీలో హీరో 'రాముడు'గా, విలన్ 'రావణుడు' వంటి పాత్రలో కనిపిస్తాడు.

Mowgli Teaser : ‘మోగ్లీ 2025’ సినిమా టీజర్ విడుదల

విధాత : రోషన్న్‌ కనకాల హీరోగా సందీప్‌ రాజ్‌ తెరకెక్కిస్తున్న చిత్రం ‘మోగ్లీ 2025’ నుంచి మేకర్స్ టీజర్ విడుదల చేశారు. ఫారెస్టు బ్యాక్ డ్రాప్ తో సాగే లవ్ స్టోరీతో యాక్షన్ మూవీగా ఈ సినిమా రాబోతుందని టీజర్ సన్నివేశాలు చూస్తే అర్ధమవుతుంది. నేను రాముడిని, తను నా సీత..అంటూ హీరో డైలాగ్ లు..పోనిలే రావణుడి లేడు అంటూ హీరో స్నేహితుడు చెప్పడం..ఆ వెంటనే రావణుడి వంటి విలన్ పాత్ర ఎంటరవ్వడం..హీరో హీరోయిన్లను విలన్ వేధించడం..హీరో పోరాట దృశ్యాలతో టీజర్ ఆసక్తికరంగా సాగింది.

టీజీ విశ్వప్రసాద్, కృతి ప్రసాద్‌ సంయుక్తంగా నిర్మిస్తున్న ‘మోగ్లీ 2025’ మూవీలో సాక్షి సాగర్‌ మడోల్కర్‌ కథానాయికగా నటిస్తుంది. ఈ సినిమాకి సంగీతం: కాలభైరవ, ఛాయాగ్రహణం: ఎం.రామ మారుతి. డిసెంబరు 12న ‘మోగ్లీ’ని ప్రేక్షకుల ముందుకు రానుంది.