Theatres| ఐపీఎల్, ఎన్నికల వలన థియేటర్స్ కళతప్పాయి.వేసవిలోనే పెద్ద పెద్ద సినిమాలు విడుదలై భారీ కలెక్షన్స్ రాబడుతుంటాయి. కాని ఈ సారి అలా జరగలేదు. చిన్నా చితకా సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గత వారం విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కార్తికేయ భజే వాయువేగంతో పాటు ఆనంద్
Theatres| ఐపీఎల్, ఎన్నికల వలన థియేటర్స్ కళతప్పాయి.వేసవిలోనే పెద్ద పెద్ద సినిమాలు విడుదలై భారీ కలెక్షన్స్ రాబడుతుంటాయి. కాని ఈ సారి అలా జరగలేదు. చిన్నా చితకా సినిమాలు మాత్రమే ప్రేక్షకుల ముందుకు వచ్చాయి. గత వారం విశ్వక్ సేన్ గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి, కార్తికేయ భజే వాయువేగంతో పాటు ఆనంద్ దేవరకొండ గం గం గణేశా చిత్రాలు ప్రేక్షకులని పలకరించాయి. ఇక ఎన్నికల హంగామా పూర్తి కావడంతో ఈ వారం భారీ ఎత్తునే సినిమాలు విడుదల అవుతున్నాయి. నాలుగు తెలుగు సినిమాలు సహా మొత్తం 11 చిత్రాలు విడుదలవుతున్నాయి. రెండేళ్ల గ్యాప్ తర్వాత మనమే సినిమాతో ప్రేక్షకులని అలరించాడానికి వస్తున్నాడు శర్వానంద్.
శ్రీరామ్ ఆదిత్య దర్శకత్వంలో ఫీల్ గుడ్ మూవీగా మనమే చిత్రం తెరకెక్కగా, ఇందులో కృతి శెట్టి హీరోయిన్గా నటించింది. ఈ మూవీ మంచి విజయం సాధిస్తుందనే నమ్మకంతో ఉన్నారు ప్రేక్షకులు. ఇక కాజల్ అగర్వాల్ నటించిన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ మూవీ సత్యభామ కూడా నేడు థియేటర్స్‌లోకి వస్తుంది. సుమన్ చిక్కాల డైరెక్టర్ గా వ్యవహరించిన ఈ సినిమాలో పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా కాజల్ కనిపించి సందడి చేయనుంది. క్రైమ్ లవర్స్‌కి ఈ మూవీ ఎంతగానో నచ్చుతుందని అంటున్నారు. ఇవే కాక నవదీప్ చాలా రోజుల తర్వాత హీరోగా చేసిన చిత్రం లవ్ మౌళి. నేడే ఈ మూవీ కూడా రిలీజ్ కాబోతుంది. రొమాన్స్ ఇంటెన్స్ డ్రామాగా వస్తున్న ఈ సినిమాలో బోల్డ్ కంటెంట్ కాస్త ఎక్కువ ఉన్నట్లు తెలుస్తోంది. ఇందులో 42 కిస్ సీన్స్ ఉంటాయని ఇప్పటికే టాక్ వినిపించింది.
యూత్ ఈ సినిమాపై ఎక్కువగా దృష్టి పెట్టే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరోవైపు ఇటీవల వివాదంలో చిక్కుకున్న హీరోయిన్ పాయల్ రాజ్ పుత్ రక్షణ మూవీ కూడా నేడు థియేటర్స్‌లోకి రానుంది. ఈ మూవీపై అంత బజ్ అయితే లేదు. పాయల్ ఈ సినిమాకి పెద్దగా ప్రమోషన్ చేసింది లేదు. మంగళవారం మూవీ తర్వాత పాయల్ నుండి వస్తున్న ఈ సినిమా ఎంత హిట్ కొడుతుందనేది చూడాలి. ఇక ఇవే కాక తమిళ డబ్బింగ్ మూవీ సత్యరాజ్ వెపన్ నేడు విడుదల కానుంది. నమో, గోల్డ్ నెంబర్ వన్, ఓసి, ప్రేమించొద్దు, చోటా భీమ్ అండ్ కర్స్ ఆఫ్ ద్యాన్ సహా పలు చిత్రాలు థియేటర్స్‌లో సందడి చేయనున్నాయి.