నేడు ప్రముఖ రంగస్థల నటులు “బళ్ళారి రాఘవ” గారి జయంతి
విధాత:రాయలసీమ రత్నం, సహజ నటుడు "బళ్ళారి రాఘవ" జయంతి నేడు. 1880 ఆగస్టు 2వ తేదీన తాడిపత్రిలో ఈ నటశేఖరుడు జన్మించారు. వీరి తల్లిదండ్రులు శేషమ్మ, నరసింహాచార్యులు. వీరి తల్లి శేషమ్మ "న్యాయవాది, ఆంధ్ర నాటక పితామహా" బిరుదాంకితుడైన ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారికి చెల్లెలు. బళ్ళారి రాఘవ నాటక రంగంలో సంచలనం సృష్టించి సినిమా రంగం వైపు వెళ్లిన గొప్పనటుడాయన. ఈయన తొలి తరం కథానాయకులలో ఒకరు. 1981 లో తపాలాశాఖ గుర్తించి తపాలా బిళ్ళను విడుదల […]

విధాత:రాయలసీమ రత్నం, సహజ నటుడు “బళ్ళారి రాఘవ” జయంతి నేడు. 1880 ఆగస్టు 2వ తేదీన తాడిపత్రిలో ఈ నటశేఖరుడు జన్మించారు. వీరి తల్లిదండ్రులు శేషమ్మ, నరసింహాచార్యులు. వీరి తల్లి శేషమ్మ “న్యాయవాది, ఆంధ్ర నాటక పితామహా” బిరుదాంకితుడైన ధర్మవరం రామకృష్ణమాచార్యుల వారికి చెల్లెలు.
బళ్ళారి రాఘవ నాటక రంగంలో సంచలనం సృష్టించి సినిమా రంగం వైపు వెళ్లిన గొప్పనటుడాయన. ఈయన తొలి తరం కథానాయకులలో ఒకరు. 1981 లో తపాలాశాఖ గుర్తించి తపాలా బిళ్ళను విడుదల చేసింది. మొట్ట మొదటిసారిగా తెలుగు సినీపరిశ్రమ నుంచి ” బళ్ళారి రాఘవ” కు ఈ గౌరవం దక్కింది.
రాఘవ ఇంగ్లాండ్ వెళ్ళి లండన్ లో అనేక నాటక ప్రదర్శనలు చూశాడు. అక్కడ నాటక రంగస్థల నటులను కలుకునే క్రమంలో సుప్రసిద్ధ ఆంగ్ల విమర్శకుడు, నాటక కర్త “జార్జి బెర్నాడ్ షా” ను కలుసుకోవడం జరిగింది. మాటల సందర్భంలో ఇక్కడి కళల గురించి తెలుసుకోవాలని ఇక్కడికి వచ్చానని తెలిపారు. అప్పుడు ఆయన మీ దేశం కళలకు పుట్టిల్లు, తెలుసుకోవడానికి మేమే మీ దేశానికి రావాలి అన్నాడు. అక్కడ జార్జ్ బెర్నాడ్ షా కోరిక మేరకు రాఘవ అక్కడి పాత్రలలో నటించి షా ను మెప్పించాడు. బెర్నాడ్ షా రాఘవ నటనకు ముగ్దుడై మీరు ఇండియాలో పుట్టారు, ఇక్కడ పుట్టి ఉంటే “షేక్స్పియర్ ” అంతటి గొప్పవారై వుండే వారంటూ ప్రశంసించారు.
చివరగా మన సరస్వతీ పుత్రుడు ” పుట్టపర్తి నారాయణాచార్యులు” బళ్ళారి రాఘవ గురించి అన్న రెండు మాటలు మనం తెలుసుకుందాం.”ఆ విశాల లోచనాలు అనంత భావాల దర్పణాలు.జాతి ప్రగతికి, మూఢాచారాల నిర్మూలనకు నాటకరంగం ప్రధాన సాధనమని భావించి నాటక రంగస్థల అభివృద్ధికి ఎనలేని కృషిచేశారు.