నేడు అంజలీదేవి జయంతి
విధాత: అభినవ సీతమ్మగా పేరొందిన అంజలీదేవి 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి, నిర్మాత. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్త పి.ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగములో సంగీత దర్శకుడు. నటిగా1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో నాయికగా నటించింది. లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. […]

విధాత: అభినవ సీతమ్మగా పేరొందిన అంజలీదేవి 1950-75 తరానికి చెందిన తెలుగు సినిమా నటీమణి, నిర్మాత. ఆమె అసలు పేరు అంజనీ కుమారి. ఆమె నర్తకి కూడా. తన నటనా జీవితాన్ని రంగస్థలంతో ప్రారంభించింది. ఆమె భర్త పి.ఆదినారాయణరావు తెలుగు సినిమా రంగములో సంగీత దర్శకుడు.
నటిగా
1936లో రాజా హరిశ్చంద్రలో అంజలీదేవి చిన్న పాత్రతో పరిచయమైంది. ఆ తరువాత కష్టజీవిలో నాయికగా నటించింది. లవకుశలో ఎన్.టి. రామారావు సరసన నటించిన సీత పాత్ర మంచి పేరు తెచ్చిపెట్టింది. ఆ పాత్ర అప్పటి గ్రామీణ మహిళలను బాగా ప్రభావితం చేసింది. ఆమె కొన్ని గ్రామాలను సందర్శించడానికి వెళితే కొంతమంది ఆమెను నిజమైన సీతాదేవిగా భావించి మోకరిల్లిన సందర్భాలున్నాయని 1996లో ఒక వార్తా పత్రిక ముఖాముఖిలో పేర్కొన్నారు.సువర్ణసుందరి, అనార్కలిలో ఆమె నటన మన్ననపొందింది. దాదాపు 500 తెలుగు, తమిళ, కన్నడ చిత్రాలలో నటించింది. బృందావనం (1992), అన్న వదిన (1993), పోలీస్ అల్లుడు (1994) ఆమె నటజీవితంలో చివరి చిత్రాలు.
నిర్మాతగా
అనార్కలి (1955) లో అంజలీదేవి నాయికగా అక్కినేని నాగేశ్వరరావు జతన నటించిన సినిమాను నిర్మించింది. ఆ తరువాత భక్త తుకారాం (1973), చండీప్రియ (1980) నిర్మించింది. చండీప్రియలో జయప్రద నాయికగా శోభన్ బాబు, చిరంజీవి లతో నటించింది. మొత్తం ఈ సంస్థ 27 సినిమాలు నిర్మించారు.