Anjali | హీరోయిన్ అంజలి గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఫొటో మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విభిన్న రకాల సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నది.
Anjali | హీరోయిన్ అంజలి గురించి సినీ అభిమానులకు ప్రత్యేకంగా పరిచయం అక్కర్లేదు. ఫొటో మూవీతో టాలీవుడ్లోకి ఎంట్రీ ఇచ్చింది. ఆ తర్వాత విభిన్న రకాల సినిమాలు చేస్తూ మంచి గుర్తింపు పొందింది. ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ ఫుల్ బిజీగా ఉన్నది. ఇటీవల ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీతో ప్రేక్షకులను పలకరించింది తెలుగు బ్యూటీ. తాజాగా విశ్వక్సేన్ హీరోగా నటించిన ‘గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి’ మూవీలో ప్రత్యేక పాత్రలో నటించింది. సినిమాకు సంబంధించిన ఫంక్షన్లో అంజలి కీలక విషయాలను వెల్లడించింది. ఈ మూవీలో ఫస్ట్ టైమ్ బూతులు మాట్లాడాల్సి వచ్చిందని చెప్పింది.
విశ్వక్సేన్ హీరోగా నటించిన చిత్రం గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి. ఈ నెల 31న థియేటర్లలోకి రానున్నది. యదార్థ సంఘటనల ఆధారంగా ఈ మూవీని తెరకెక్కించారు. చిత్రాన్నికి కృష్ణ చైతన్య దర్శకత్వం వహించగా.. నేహా శెట్టి హీరోయిన్గా నటించింది. అంజలి సైతం కీలక పాత్రలో నటించింది. గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి సినిమా విడుదలకు సమయం దగ్గరపడుతున్న కొద్ది మేకర్స్ ప్రమోషన్లు నిర్వహిస్తున్నారు. తాజాగా ప్రమోషన్లో భాగంగా ఇచ్చిన ఓ ఇంటర్వ్యూలో పాల్గొంది. అంజలి సినిమా గురించి పలు ఇంట్రెస్టింగ్ విషయాలు వెల్లడించింది. ఈ మూవీలో రత్నమాల పాత్రలో నటించానని చెప్పింది.
తాను ఇంతకు ముందు చేసిన పాత్రలకు ఇది భిన్నంగా ఉంటుందని చెప్పింది. తాను ఓ మూవీలో బూతులు మాట్లాడడం ఇదే తొలిసారి అని చెప్పుకొచ్చింది. ఇదే విషయాన్ని తన క్యారెక్టర్‌కి డబ్బింగ్ చెప్పే సమయం కూడా తమ చిత్ర యూనిట్ చెప్పినట్లు అంజలి తెలిపింది. నిజ జీవితంలోనూ తాను ఎప్పుడూ బూతులు వాడనని.. అలాంటి తనను రత్నమాల పాత్ర కోసం దర్శకుడు సంప్రదించడం ఆశ్చర్యంగా అనిపించిందని పేర్కొంది. ఇక ఇక అంజలి గురించి డైరెక్టర్ కృష్ణ చైతన్య ఆసక్తికరమైన విషయాలు చెప్పారు.
రత్నమాల పాత్రలో అంజలిని తీసుకోవడానికి కారణం ఏంటని మీడియా ప్రశ్నించగా.. అంజలి తనను తాను నిరూపించుకున్న నటి అని.. అలాంటి వారు ఎలాంటి పాత్రనైనా చేయగలరన్నారు. అందుకు ఈ మూవీలో అంజలిని తీసుకున్నామన్నారు. ఇదిలా ఉండగా.. అంజలి ప్రస్తుతం శంకర్ దర్శకత్వంలో రామ్‌చరణ్ హీరోగా తెరకెక్కుతున్న ‘గేమ్ ఛేంజర్’ మూవీలోని నటిస్తున్నది. రామ్‌చరణ్ ఈ మూవీలో డబుల్ రోల్లో కనిపించనుండగా.. ఓ పాత్రకు జోడీ కట్టబోతున్నట్లు తెలుస్తున్నది.