Dacoit | డెకాయిట్ ను మృణాల్ మూడు గంటల్లో కన్ఫర్మ్ చేశారు

Dacoit | డెకాయిట్ ను మృణాల్ మూడు గంటల్లో కన్ఫర్మ్ చేశారు

Dacoit | విధాత: టాలీవుడ్ యువ నటుడు అడివి శేష్(Adivi Sesh) ప్ర‌ధాన పాత్ర‌లో..మృణాల్ ఠాకూర్(Mrunal Thakur) హీరోయిన్ గా నటిస్తున్నఇంటెన్స్ యాక్షన్ లవ్ స్టోరీ చిత్రం ‘డెకాయిట్'(Dacoit). వన్ లవ్ స్టోరీ ట్యాగ్ లైన్ తో షానీల్ డియో(Shanil Deo) ద‌ర్శ‌క‌త్వంలో రాబోతున్న సినిమా షూటింగ్ పూర్తి కావచ్చింది. ఈ సినిమాను హిందీ, తెలుగు భాషల్లో ఏకకాలంలో చిత్రీకరిస్తుండ‌గా హైదారాబాద్ లో జరుగుతున్న షెడ్యూల్ లో మృణాల్ ఠాకూర్, అడవి శేష్ ల మధ్య కీలక సన్నివేశాలను చిత్రీకరించారు. మొదట్లో ఈ సినిమాలో శృతి హాసన్ ను(Shruti Haasan) హీరోయిన్ గా తీసుకున్నారు. కానీ ఆమె మధ్యలో తప్పుకుంది. చివరకు మృణాల్ ఠాకూర్ ను తీసుకున్నారు. ఈ సినిమాలో మృణాల్ ఠాకూర్ నటించడంపై అడవి శేష్ తాజాగా ఆసక్తికర కామెంట్ చేశారు. సాధారణంగా బాలీవుడ్ హీరోయిన్లు ఓ సినిమాను కన్ఫ్మర్ చేయడానికి నెల రోజుల సమయం తీసుకుంటారని..కాని డెకాయిట్(Dacoit) కు మృణాల్ మూడు గంటల్లో అంగీకారం తెలిపారని వెల్లడించారు. ఇటీవలే విడుదలైన సినిమా పవర్-ప్యాక్డ్ గ్లింప్స్‌కు ప్రేక్షకుల నుంచి అద్భుతమైన స్పందన లభించింది.

మృణాల్‌ జూలియట్‌ పాత్రలో కనిపించారు. ‘జూలియట్‌ నిన్ను అందరూ మోసం చేశారు. నేను అందుకు రాలేదు..’ అంటూ శేష్‌ చెప్పిన డైలాగ్ సినిమా కథనంపై క్రేజ్ పెంచింది. ఇద్దరు మాజీ ప్రేమికులు తమకు ఇష్టం లేకపోయినా ఓ క్రైమ్‌ను కలిసి చేయాల్సి వస్తే ఏం జరుగుతుందన్నదే డెకాయిట్ కథాంశమని ఫిల్మ్‌నగర్‌ టాక్. సినిమాలోని కొంత భాగం రాయలసీమ నేపథ్యంలో, ఉంటుందని.. మదనపల్లె యాసలో అడివి శేష్‌(Adivi Sesh) క్యారెక్టర్‌ సాగుతుందని సమాచారం.

ఈ చిత్రంలో ప్రకాష్ రాజ్, సునీల్, అతుల్ కులకర్ణి, జైన్ మేరీ ఖాన్, అనురాగ్ కశ్యప్, కామక్షి భాస్కర్లా వంటి ప్రముఖ నటులు నటిస్తున్నారు. ఈ సినిమాకు అడివి శేష్, షానీల్ డియో సంయుక్తంగా కథ, స్క్రీన్‌ప్లే అందించారు. భీమ్స్ సెసిరోలియో(Bheems Ceciroleo) ఈ సినిమాకు సంగీతం అందిస్తున్నారు.. అన్నపూర్ణ స్టూడియోస్‌(Annapurna Studios) సమర్పణలో సుప్రియ యార్లగడ్డ(Supriya Yarlagadda) నిర్మిస్తున్న ఈ సినిమా డిసెంబరు 25న(December 25th) విడుదల కానుంది.