Allu Arjun : అల్లు అర్జున్ సినిమాలో విజయ్ సేతుపతి!
అల్లు అర్జున్–అట్లీ కాంబోలో వస్తున్న పాన్ వరల్డ్ సినిమాలో విజయ్ సేతుపతి కీలక పాత్రలో నటించనున్నారని టాక్ వినిపిస్తోంది.

Allu Arjun | విధాత : పాన్ వరల్డ్ సినిమాగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్(Allu Arjun) – దర్శకుడు అట్లీ కుమార్(Atlee Kumar) కాంబినేషన్ లో వస్తున్న సినిమా చిత్రీకరణకు ముందే టాక్ ఆఫ్ దీ ఇండస్ట్రీలో ఒకటిగా నిలిచింది. భారీ తారగణంతో వస్తున్న ఈ సినిమా అభిమానుల్లో.. వ్యాపార వర్గాల్లో ఇప్పటికే ఆసక్తి రేకెత్తించింది. సినిమాల్లో నటిస్తున్న నటినటుల జాబితా రోజురోజుకు పెరిగిపోతూ సినిమాపై అంచనాలను సైతం పెంచుతుంది. అల్లు అర్జున్ మెయిన్ హీరోయిన్ గా ఇప్పటికే దీపికా పదుకొణె(Deepika Padukone) పేరుని అధికారికంగా ప్రకటించారు. మిగతా ప్రధాన పాత్రల్లో మృణాల్ ఠాకూర్(Mrunal Thakur), రష్మిక(Rashmika) పేర్లు కూడా వినిపిస్తున్నాయి. అలాగే సీనియర్ కథానాయిక రమ్యకృష్ణ(Ramya Krishnan) కూడా ఈ సినిమాలో ఓ కీలక పాత్ర కోసం ఎంపికయ్యారని టాక్. ఈ మూవీకి సంబంధించిన తాజా వివరాల మేరకు తమిళ స్టార్ విజయ్ సేతుపతి(Vijay Sethupathi) కూడా ఇందులో ఓ కీలక పాత్రలో కనిపిస్తారట. ఎప్పటికప్పుడు ప్రముఖ నటినటులు జాబితా పెరిగిపోతున్న ఈ సినిమా విషయాలపై చిత్రబృందం నుంచి మాత్రం అధికారిక సమాచారం వెల్లడికావాల్సి ఉంది.
బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కథానాయకుడిగా అట్లీ దర్శకత్వం వహించిన ‘జవాన్’ సినిమాలో విజయ్ సేతుపతి విలన్ రోల్ చేశారు. హిందీ ప్రేక్షకుల్లో ఆయనకు ఆ క్యారెక్టర్ మంచి పేరు తీసుకువచ్చింది. ఇప్పుడు మరోసారి విజయ్ సేతుపతిని తన సినిమాలోకి తీసుకోవడానికి అట్లీ ప్లాన్ చేస్తున్నారని సమాచారం. సన్ పిక్చర్స్ పతాకం మీద కళానిధి మారన్ ప్రొడ్యూస్ చేస్తున్నారు. ఈ సినిమాకు హాలీవుడ్ కంపెనీలు వీఎఫ్ఎక్స్ చేస్తున్న సంగతి తెలిసిందే. షూటింగ్ స్టార్ట్ చేయక ముందు అమెరికాలోని లాస్ ఏంజిల్స్ వెళ్లి అక్కడి కంపెనీలతో హీరో, దర్శకులు చర్చలు జరిపారు. ప్రస్తుతం ఈ సినిమా షూటింగ్ ముంబైలో కొనసాగుతుంది.