Aishwarya Rajinikanth|కొత్తింట్లోకి అడుగుపెట్టిన ఐశ్వర్య రజనీకాంత్… అందరికి ఆహ్వానం, ధనుష్‌కి మాత్రం లేదు..!
Aishwarya Rajinikanth| సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె దర్శకురాలిగా కూడా పలు సినిమాలు చేసింది. అయితే ధనుష్‌ని వివాహం చేసుకొని 18 ఏళ్ల పాటు అతనితో సంసారం చేసిన ఐశ్వర్య ఇటీవల అతని నుండి విడాకులు తీసుకుంది.

Aishwarya Rajinikanth| సూపర్ స్టార్ రజనీకాంత్ కూతురు ఐశ్వర్య రజనీకాంత్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె దర్శకురాలిగా కూడా పలు సినిమాలు చేసింది. అయితే ధనుష్‌ని వివాహం చేసుకొని 18 ఏళ్ల పాటు అతనితో సంసారం చేసిన ఐశ్వర్య ఇటీవల అతని నుండి విడాకులు తీసుకుంది. ఉన్నట్టుండి ఈ జంట సోషల్ మీడియా వేదికగా విడిపోతున్నట్టు అనౌన్స్ చేసి అభిమానులకు పెద్ద షాక్ ఇచ్చారు. ధనుష్ , ఐశ్వర్య విడిపోతున్నారంటే ఆ విషయాన్ని ఎవరు కూడా నమ్మలేకపోయారు. అసలు ఇప్పటి వరకు వారద్దరు విడిపోయారో కూడా తెలియదు. కాని వారి విడాకులకి సంబంధించి సోషల్ మీడియాలో నిత్యం ఏదో ఒక వార్త హల్‌చల్ చేస్తూనే ఉంటుంది.
అయితే ధనుష్ నుండి విడిపోయిన తర్వాత తన తల్లిదండ్రులతో కలిసి ఉంది ఐశ్వర్య. ఇప్పుడు ఆమె కొత్త ఇంటిని కొనుగోలు చేసింది.ఒక అపార్ట్‌మెంట్‌లో డ్యుప్లెక్స్ హౌజ్ కొనుగోలు చేయగా, దానికి సంబంధించిన గృహ ప్రవేశ వేడుకని జరిపించారు. రజనీకాంత్‌తో పాటు పలువురు ప్రముఖులు కూడా ఈ వేడుకలో కనిపించి సందడి చేశారు. అయితే ధనుష్ మాత్రం ఎక్కడ కనిపించలేదు. పిల్లల స్కూల్ ఈవెంట్స్‌కి ఇటీవల ధనుష్, ఐశ్వర్య కలిసి వెళ్లారు. ఒకరి సినిమాలకి ఒకరు విష్ చేసుకుంటున్నారు. మరి కొత్త ఇంటి గృహప్రవేశానికి ధనుష్‌ని పిలవలేదా, పిలిచిన ధనుష్ పోలేదా అని అందరు ముచ్చటించుకుంటున్నారు. అయితే ఇప్పుడు కొత్త ఇంట్లో ఐశ్వర్య తన కొడుకులతో కలిసి ఉంటుంది.
ప్రత్యేకమైన ఇంటీరియర్ డిజైన్స్ తో… భారీ స్థాయిలో ఇల్లు అద్భుతంగా నిర్మించుకుంది. ఈ ఇల్లు ప్రతి ఒక్కరిని ఆకట్టుకుంటుంది. ఇంటి గ్రహప్రవేశం చాలా సింపుల్ గా జరిగింది. వేడుకకి ఐశ్వర్య తండ్రి రజినికాంత్, తల్లి లత, ఆమె ఇద్దరు కుమారులు లింగ, యాత్ర మరియు ఆమె స్నేహితురాలు హాజరైనట్టు తెలుస్తుంది. ఇక ఇదిలా ఉంటే ధనుష్ ఇటీవల తన పేరెంట్స్ కోసం భారీ స్థాయిలో ఇల్లుని కొనుగోలు చేసి ఇచ్చారు. ఆ విషయంలోనే ధనుష్, ఐశ్వర్యలకి గొడవలు వచ్చి ఉంటాయని పలువురు భావిస్తున్నారు. ఇక ఇటీవల ఐశ్వర్య తన తండ్రి లీడ్ రోల్ లో ‘లాల్ సలామ్’ సినిమాను డైరెక్ట్ చేశారు..సంక్రాంతి కానుకగా విడుదలైన ఈ సినిమా అంతగా ఆకట్టుకోలేక పోయింది.