Akkineni Family| ఎన్నిక‌ల వేళ ఒక్క చోట చేరిన అక్కినేని క‌జిన్స్ .. వైర‌ల్ అవుతున్న ఫొటో

Akkineni Family| దేశ‌మంతా కూడా ఎన్నిక‌ల హంగామా క‌నిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల వేవ్ మాములుగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగుతుండగా, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7

  • By: sn    cinema    May 12, 2024 5:15 PM IST
Akkineni Family| ఎన్నిక‌ల వేళ ఒక్క చోట చేరిన అక్కినేని క‌జిన్స్ .. వైర‌ల్ అవుతున్న ఫొటో

Akkineni Family| దేశ‌మంతా కూడా ఎన్నిక‌ల హంగామా క‌నిపిస్తుంది. ముఖ్యంగా తెలుగు రాష్ట్రాల‌లో ఎన్నిక‌ల వేవ్ మాములుగా లేదు. తెలుగు రాష్ట్రాల్లో ఎన్నికల ఏర్పాట్లు దాదాపు పూర్తయ్యాయి. ఏపీలో అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికలు జరగుతుండగా, తెలంగాణలో లోక్‌సభ ఎన్నికలు జరగనున్నాయి. ఉదయం 7 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకూ పోలింగ్ జరుగుతుంది. ఇక మావోయిస్టు ప్రభావిత ప్రాంతాల పరిధిలోని 13 అసెంబ్లీ నియోజకవర్గాల్లో మాత్రం సాయంత్రం 4 గంటలకే పోలింగ్ ముగియనుంది. ఇక ఎన్నిక‌ల‌లో త‌మ ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు చాలా మంది వారి వారి ఊర్లకు చేరుకుంటున్నారు. విదేశాల‌లో ఉన్న సినీ సెల‌బ్రిటీలు సైతం హైద‌రాబాద్‌కి త‌ర‌లి వ‌చ్చారు.

అయితే ఓటు హ‌క్కు వినియోగించుకునేందుకు హైద‌రాబాద్‌కి చేరిన అక్కినేని క‌జిన్స్ ఈ రోజు ఆదివారం కావ‌డంతో ఒక్క చోట చేరారు. అంద‌రు క‌లిసి స‌ర‌దాగా గ‌డిపారు. అయితే చాలా ఏళ్ల త‌ర్వాత అక్కినేని క‌జిన్స్ అంద‌రు ఒకే ఫ్రేములో క‌లిసి క‌నిపించ‌డంతో ఫ్యాన్స్ ఆనందానికి అవ‌ధులు లేవు. హీరో సుశాంత్.. అక్కినేని, వారి కుటుంబంలోని కజిన్స్ తో క‌లిసి దిగిన ఫొటోని సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌గా, ఇది క్ష‌ణాల‌లో వైర‌ల్ అయింది. ఫొటోలో నాగ చైతన్య‌, అఖిల్‌, సుమంత్, సుశాంత్, సుప్రియ.. మరికొంతమంది కజిన్స్ ఉన్నారు. ఇలా అందరూ ఒకే చోట చేరిన ఫొటోని నెట్టింట వైర‌ల్ చేస్తున్నారు.

అక్కినేని క‌జిన్స్ లో సుమంత్, సుశాంత్, నాగ చైత‌న్య‌, అఖిల్ తో పాటు మ‌రి కొంద‌రు మాత్రమే సినీ ప‌రిశ్ర‌మ‌లో ఉన్నారు. మిగ‌తా వారంద‌రు బిజినెస్‌లు చేసుకుంటూ ఉన్నారు. అయితే చాలా కాలం త‌ర్వాత ఇలా అందరు ఒక్క చోట చేర‌డం అభిమానుల‌కి క‌న్నుల‌పండుగ‌గా మారింది. ఇక అక్కినేని హీరోలు నాగ చైత‌న్య ప్ర‌స్తుతం తండేల్ మూవీ షూటింగ్‌తో బిజీగా ఉన్నాడు. గ‌త కొద్ది రోజులు ఈ మూవీ కోసం చాలా క‌ష్ట‌ప‌డుతున్నాడు. వ‌రుస ఫ్లాపులు చైతూని ప‌ల‌క‌రిస్తుండ‌డంతో ఈ సినిమా మంచి హిట్ కొట్టాల‌ని అభిమానులు కూడా కోరుకుంటున్నారు.