Allu Arjun| అల్లు అర్జున్‌పై ఆర్పీ సంచలన వ్యాఖ్యలు.. హోటల్స్‌పై దాడి చేసిన బన్నీ ఫ్యాన్స్
Allu Arjun| ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం కొద్దిగంటల్లో ముగుస్తుందనగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో ప్రత్యక్షం కావడం ఎంత పెద్ద దుమారం రేపిందో మనం చూశాం. సొంత మామయ్య దగ్గరకి వెళ్లకుండా ప్రతిపక్షానికి చెందిన వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి మ

Allu Arjun| ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ, లోక్‌సభ ఎన్నికల ప్రచారం కొద్దిగంటల్లో ముగుస్తుందనగా ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నంద్యాలలో ప్రత్యక్షం కావడం ఎంత పెద్ద దుమారం రేపిందో మనం చూశాం. సొంత మామయ్య దగ్గరకి వెళ్లకుండా ప్రతిపక్షానికి చెందిన వైసీపీ అభ్యర్ధి శిల్పా రవిచంద్రకిశోర్ రెడ్డికి మద్ధతు పలకడం, ఆయనని గెలిపించాలని అతని చేయి పట్టుకుని మరీ ఓటర్లకు విజ్ఞప్తి చేయడంపై మెగా ఫ్యాన్స్ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇక నాగబాబు సైతం బన్నీని ఉద్దేశించి ఇన్‌డైరెక్ట్ కామెంట్స్ చేశారనే ప్రచారం నడిచింది. అయితే ఇదే సమయంలో జబర్ధస్త్ ఫేమం కిరాక్ ఆర్పీ ఇటీవల పలు ఇంటర్వ్యూలలో పాల్గొంటూ కూటమి విజయం పట్ల సంతోషం వ్యక్తం చేయడమే కాకుండా వైసీపీ పార్టీకి మద్దతు తెలిపిన నటుడు అల్లు అర్జున్‌పై విమర్శలు చేశారు.
అల్లు అర్జున్ సపోర్ట్ చేసిన నంద్యాల ఎమ్మెల్యే అభ్యర్థి శిల్ప రవి చంద్ర కిషోర్ ఓడిపోయాడని, కానీ రాష్ట్రం కోసం పదేళ్లుగా కష్టపడుతున్న మావయ్య పవన్ కళ్యాణ్ కు వ్యతిరేకంగా అల్లు అర్జున్ వైసీపీ అభ్యర్ధికి సపోర్ట్ చేయడం నచ్చలేదని, దీని మెగా ఫ్యామిలీ స్పందించకపోయిన నేను స్పందిస్తానని కిరాక్ ఆర్పీ అన్నారు. ఆయన పవన్ కళ్యాణ్ మద్దతు తెలపకపోవడం చాలా పెద్ద తప్పు అంటూ బన్నీపై తీవ్ర స్థాయిలో విమర్శలు గుప్పించారు. ఇక దీనిపై బన్నీ అభిమానులు తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేస్తూ.. కిరాక్ ఆర్పీ చేపల పులుసు రెస్టారెంట్ పై దాడులు చేశారని కొన్ని వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. హైదరాబాద్‌లో ఉన్న కిరాక్ ఆర్పీ హోటల్స్‌పై దాడి జరిగినట్టు ప్రచారాలు జరుగుతుండగా, దీనిపై ఇప్పటి వరకు ఆర్పీ స్పందించలేదు.
అసలు నిజంగానే ఆయన రెస్టారెంట్ పై దాడి జరిగిందా లేదా అనేది తెలియాలంటే కిరాక్ ఆర్పీ స్పందించాల్సిందే. ఇక ఇదిలా ఉంటే కిరాక్ ఆర్పీ ఎన్నికల ప్రచార సమయంలో రోజాపై కూడా దారుణమైన వ్యాఖ్యలు చేశాడు. ‘రోజా మాకు గౌరవం ఇస్తే.. మేము గౌరవిస్తాం. రోజా యువరాణి గొప్ప నటా.. ఆస్కార్ అవార్డులు ఏమైనా కొట్టిందా? కనీసం గెటప్ శీను, ఆది, సుధీర్ లా స్కిట్స్ చేయగలదా .. రాష్ట్రంలో ఓడిపొయే ఫస్ట్ సీటు రోజానే. జగన్ చేసే దుర్మార్గాలను అడగలేదు కానీ.. వారానికోసారి రోజా తిరుమల వెళ్తుంది.’ అంటూ మంత్రి రోజాపై ఆర్పీ తీవ్రమైన కామెంట్స్ చేశాడు. దానిపై రోజా ఏ మాత్రం స్పందించలేదు.