Allu Arjun|బన్నీ చేతిలో గాజు గ్లాసు.. ఇన్‌డైరెక్ట్‌గా పవన్ కళ్యాణ్‌కి ప్రచారం చేస్తున్నాడా..!
Allu Arjun| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప2. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. `పుష్ప పుప్పు.. పుష్ప పుష్ప `అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు.

Allu Arjun| ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటిస్తున్న తాజా చిత్రం పుష్ప2. ఈ సినిమా కోసం ఫ్యాన్స్ ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఆగస్ట్ 15న చిత్రాన్ని ప్రేక్షకుల ముందుకు తీసుకురానున్న నేపథ్యంలో మేకర్స్ ప్రమోషన్ స్పీడ్ పెంచారు. `పుష్ప పుప్పు.. పుష్ప పుష్ప `అంటూ సాగే పాటని రిలీజ్ చేశారు. పుష్ప రాజ్ క్యారెక్టర్‌ని, పుష్పరాజ్ ఇమేజ్‌ని తెలియజేసేలా ఈ పాట ఉండడం విశేషం. దేవిశ్రీ ప్రసాద్ సంగీతం అందించిన ఈ పాటకి చంద్రబోస్ లిరిక్స్ రాయగా, నకాష్ అజిజ్, దీపక్ బ్లూ ఆలపించారు. పాన్ ఇండియా స్థాయిలో ఐదు భాషల్లో ఈ పాటని విడుదల చేశారు. ఇందులో పుష్ప బ్రాండ్‌ని కూడా చూపించే విధంగా పాట ఉంది. అయితే ఈ సాంగ్ తో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కు తన ఫుల్ సపోర్ట్ ను బన్నీ ప్రకటించినట్టుగా ఉంది.
పవన్ కళ్యాణ్ ప్రస్తుతం ఎన్నికల ప్రచారంలో బిజీగా ఉన్నాడు. ఈ సారి పిఠాపురం నుంచి పవన్ కళ్యాణ్ ఎన్నికల బరిలోకి దిగుతుండగా, ఆయనని గెలిపించేందుకు ప్రతి ఒక్కరు తమవంతు సపోర్ట్ అందిస్తున్నారు. ఇటీవల మెగా హీరో వరుణ్ తేజ్ ఏకంగా పిఠాపురం వెళ్లి ప్రచారం చేశాడు. ఇక జబర్ధస్త్ కమెడీయన్స్ కూడా గత కొద్ది రోజులుగా ప్రచార కార్యక్రమాలలో పాల్గొంటున్నారు. ఇక ఇప్పుడు బన్నీ టైం వచ్చింది. జనసేనాని పార్టీ గుర్తు గాజు గ్లాసు కాగా, తాజాగా రిలీజ్ అయిన పుష్పరాజ్ సాంగ్ లో గాజు గ్లాస్ కు గట్టిగా ప్రచారం చేశాడు అల్లు అర్జున్. ఈ సాంగ్ లో గాజు గ్లాస్ లో టీ పోసుకొని పట్టుకున్నాడు. ఈ గాజుగ్లాసుని చాలా సేపు చూపించారు.
గాజు గ్లాసులో టీ తాగుతూ, బిస్కెట్ తింటూ కనిపించాడు. గాజు గ్లాస్ క్లోజ్ షాట్స్ కూడా ఎక్కువగానే ఉండడంతో అల్లు అర్జున్.. పవన్ కళ్యాణ్‌కి గట్టి ప్రమోషనే చేశాడు అని పలువురు ముచ్చటించుకుంటున్నారు. పవన్ కళ్యాణ్, అల్లు అర్జున్‌కి ఏ మాత్రం పడేది కాదని విమర్శలు వస్తున్న నేపథ్యంలో అల్లు అర్జున్ జనసేనానికి ఇచ్చిన సపోర్ట్‌తో అన్నింటికి చెక్ పడింది. ఇక ఇదిలా ఉంటే త్వరలో మెగాస్టార్ చిరంజీవి కూడా పవన్ కళ్యాణ్ తరపున ప్రచారానికి రెడీ అవుతారని టాక్ వినిపిస్తుంది.