Anchor Ravi| ఫీమేల్ యాంకర్ పక్కన లేకుండా షో చేయను.. రవి ఇంత పచ్చిగా చెప్పాడేంటి?
Anchor Ravi| టాలీవుడ్ మోస్ట్ పాపులర్ మేల్ యాంకర్స్‌లో రవి ఒకరు. తన మాటలతో ప్రేక్షకులకి కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాడు. రవి యాంకరింగ్ అద్భుతంగా చేసిన ఒక్కోసారి అతను కాంట్రవర్సీలలలో ఇరుక్కోవడంతో అతనికి కాస్త నెగెటివిటీ ఇమేజ్ కూడా ఏర్పడింది. ఓ యాంకర్ అయితే పలు ఇంటర్వ్యూలలో రవి గురించి దారుణంగా మాట్లాడింది. ఇక రవి రీసెంట్‌గా రీతూ చౌదరి హోస్ట్ చేస్తున్న దావత్ అనే షోకి హాజరు అయ్యాడు. ఆ షోలో రీ

Anchor Ravi| టాలీవుడ్ మోస్ట్ పాపులర్ మేల్ యాంకర్స్‌లో రవి ఒకరు. తన మాటలతో ప్రేక్షకులకి కావల్సినంత ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తాడు. రవి యాంకరింగ్ అద్భుతంగా చేసిన ఒక్కోసారి అతను కాంట్రవర్సీలలలో ఇరుక్కోవడంతో అతనికి కాస్త నెగెటివిటీ ఇమేజ్ కూడా ఏర్పడింది. ఓ యాంకర్ అయితే పలు ఇంటర్వ్యూలలో రవి గురించి దారుణంగా మాట్లాడింది. ఇక రవి రీసెంట్‌గా రీతూ చౌదరి హోస్ట్ చేస్తున్న దావత్ అనే షోకి హాజరు అయ్యాడు. ఆ షోలో రీతూ అడిగిన పలు ప్రశ్నలకు ఆసక్తికర సమాధానాలు ఇచ్చాడు. రీతూ.. రవికి ఓ ప్రశ్న వేసింది. ఫీమేల్ యాంకర్ తో ఎందుకు ఆ రేంజ్ లో రూమర్స్ వచ్చాయి అని అడగగా, దానికి రవి స్పందిస్తూ.. ఫిమేల్ యాంకర్స్ లేకుండా నేను షో చేయను. దానికి కారణం ఉంది అని చెప్పుకొచ్చాడు.
నాకు మాత్రమే పేరు రావాలంటే నేను ప్రొడ్యూసర్‌తో మాట్లాడి ఒక్కడిని యాంకరింగ్ చేయవచ్చు. కాని అలా చేస్తే షోకి అందరం రాదు. మనం న్యూస్ ఛానెల్స్ చూసేటప్పుడు కూడా న్యూస్ రీడర్ లేడి అయితేనే చూస్తాం. జనరల్ గా సైకాలజీ అది. అలా నా పక్కన ఒక ఫిమేల్ యాంకర్ ఉంటే.. ఆమె అందం, నా ఎనేర్జి వల్ల షోకి బ్యూటిఫుల్ గా మారుతుంది అంటూ ఏవేవో లాజిక్‌లు చెప్పుకొచ్చాడు రవి.నేను మంచి కంటెంట్ అయితే ఇవ్వగలను, కాని ఆడియన్స్ ఎక్కువ సేపు చూసేలా చేయలేను. అలా చూడాలి అంటే కాస్త గ్లామర్ కూడా యాడ్ కావాలని రవి అన్నాడు. నేను ఫీమేల్స్ యాంకర్స్‌తో ఎక్కువగా పని చేయడానికి కారణం కూడా ఇది అని చెప్పుకొచ్చాడు.
ఫీమేల్ యాంకర్స్‌తో ఎక్కువగా చేయడం వలన తనపై చాలా రూమర్స్ స్ప్రెడ్ చేశారు. వాటిని తప్పుగా అర్ధం చేసుకున్నారు. మేం స్క్రీన్‌పై ఏది చేసిన అది షో కోసమే. కాకపోతే అది తప్పుగా జనాలలోకి వెళుతుంది అనుకున్నప్పుడు ఫీమేల్ యాంకర్స్‌తో ఎంత వరకు ఉండాలో అంతవరకు మాత్రమే ఉంటాను. ఫీమేల్ యాంకర్స్ గ్లామర్ ఉపయోగించుకుని షోకి పాపులారిటీ తీసుకురావడం మాత్రమే తన ముఖ్య ఉద్దేశం అంటూ రవి స్పష్టం చేశాడు. కాగా ఒకప్పుడు రవి,లాస్య జోడికి మాత్రం పిచ్చ క్రేజ్ ఉండేది.