ఉద‌య భాను ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఐదు ప‌దుల వ‌య‌స్సులోను స‌త్తా చాటేందుకు రెడీ..!

ఉద‌య భాను ఫ్యాన్స్‌కి గుడ్ న్యూస్.. ఐదు ప‌దుల వ‌య‌స్సులోను స‌త్తా చాటేందుకు రెడీ..!

ఒక‌ప్పుడు బుల్లితెర‌ని షేక్ చేసిన ఉద‌య భాను ఇప్పటి త‌రం వాళ్ల‌కి అంత‌గా తెలియ‌క‌పోవ‌చ్చు కాని పాత త‌రం వాళ్లు మాత్రం ఏ మాత్రం మ‌ర‌చిపోయి ఉండ‌రు. అప్ప‌ట్లో ప్రతీ ఎంటర్‌టైన్మెంట్ ఛానెల్‌లో ఉదయభాను యాంకరింగ్ చేసే ప్రోగ్రామ్ త‌ప్ప‌క ఉండేది. ఆమె షోస్‌కి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుండ‌డంతో ప్ర‌తి ఒక్క ఛానెల్ కూడా ఆమెతోనే స్పెష‌ల్ షోలు చేయించేవారు. సుమ‌, ఝాన్సీ వంటి వారు అప్ప‌ట్లో ఉన్నా కూడా ఉద‌య భానుకి పెద్ద పోటీ ఇచ్చేవారు కాదు. అయితే ఈమె జీవితంలో అనుకోని ఇబ్బందులు కష్టాల వల్ల ఈమె కెరీర్ కు బ్రేక్ వచ్చేలా చేశాయి.

ఇక వివాహం చేసుకున్న తర్వాత బుల్లితెరకు పూర్తిగా దూరమైంది. అయితే ఇన్నాళ్లకు మళ్ళీ ఆమె బుల్లితెర పైన అభిమానులను సైతం అలరించేందుకు సిద్ధమైన‌ట్టు తెలుస్తుంది. చాలా ఏళ్ల తర్వాత జీ తెలుగులో జరిగిన ఒక ఈవెంట్‌లో తన పిల్లలతో కలిసి కనిపించిన‌ ఉదయభాను..ఈ ఈవెంట్‌లో మళ్లీ యాంకరింగ్ మొదలుపెడతానని మాటిచ్చింది. అప్పటినుంచి పలు ఈవెంట్స్‌కు యాంకరింగ్ చేస్తూ వస్తున్న ఉదయభాను.. జీ తెలుగులో ప్రసారం కానున్న షోతో హోస్ట్‌గా మరోసారి తన కెరీర్‌ను రీస్టార్ట్ చేయనుంద‌ని తెలుస్తుంది. తాజాగా జీ తెలుగు ఉద‌య భానుకి సంబంధించి ప్రోమో విడుద‌ల చేసింది.

ఇందులో అమ్మ చెప్పేది అమ్మగా గెలిస్తేనే అన్నింటిలో గెలిచినట్టు అని. అమ్మను అయ్యాకే అమ్మ చెప్పింది గుర్తొచ్చింది. అన్నీ పక్కన పెట్టేశాను. పిల్లలే జీవితం అయిపోయారు. నాకు అమ్మలు అయిపోయారు’’ అంటూ ఉదయభాను చెప్పిన‌ మాటలతో ఈ ప్రోమో ప్రారంభమవుతుంది. అదే సమయంలో ‘‘ఆపొద్దు అమ్మ’’ అంటూ తన పిల్లలు చెప్పడంతో ‘సూపర్ జోడీ’తో యాంకర్‌గా రీఎంట్రీ ఇస్తున్నట్టుగా చెప్ప‌క‌నే చెప్పింది. ‘గోల్డెన్ లేడీ ఆఫ్ జీ తెలుగు ఈజ్ బ్యాక్’ అని ట్యాగ్‌తో ఉదయభాను ప్రోమోను విడుదల చేయ‌గా, ఇది చూసిన ఫ్యాన్స్ ఇక ర‌చ్చ ర‌చ్చే అటున్నారు. ‘సూపర్ జోడీ’ షో జనవరి 28న లాంచ్ కానుండ‌గా, ఈ షోకి ఉదయ భాను యాంక‌రింగ్ చేస్తుందా, లేదా జడ్జిగా వ్య‌వ‌హ‌రిస్తుందా అనే దానిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.