Anil Ravipudi|ఐపీఎల్ వివాదం… న‌న్ను అపార్ధం చేసుకోవ‌ద్దు అంటున్న ఎఫ్‌3 డైరెక్ట‌ర్

Anil Ravipudi| రాజ‌మౌళి త‌ర్వాత ఓట‌మి అనేది లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్న ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి. ఆయ‌న చేసిన ప్ర‌తి చిత్రం కూడా ఇప్ప‌టి వ‌రకు మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. అనీల్‌లో మల్టీ టాలెంట్ ఉంది. ఆయ‌న ద‌ర్శ‌కుడిగానే కాకుండా హోస్ట్‌గా, డ్యాన్స‌ర్‌గా త‌న అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రి

  • By: sn    cinema    May 04, 2024 6:05 PM IST
Anil Ravipudi|ఐపీఎల్ వివాదం… న‌న్ను అపార్ధం చేసుకోవ‌ద్దు అంటున్న ఎఫ్‌3 డైరెక్ట‌ర్

Anil Ravipudi| రాజ‌మౌళి త‌ర్వాత ఓట‌మి అనేది లేకుండా వ‌రుస సినిమాలు చేస్తున్న ద‌ర్శ‌కుడు అనీల్ రావిపూడి. ఆయ‌న చేసిన ప్ర‌తి చిత్రం కూడా ఇప్ప‌టి వ‌రకు మంచి క‌లెక్ష‌న్స్ రాబ‌ట్టింది. అనీల్‌లో మల్టీ టాలెంట్ ఉంది. ఆయ‌న ద‌ర్శ‌కుడిగానే కాకుండా హోస్ట్‌గా, డ్యాన్స‌ర్‌గా త‌న అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రిస్తూ ఉంటాడు. `పటాస్‌` నుంచి `ఎఫ్‌ 3` వరకు తనదైన కామెడీ చిత్రాలతో అలరించిన అనీల్ రావిపూడి త‌న చిత్రాల‌లో కామెడీతో పాటు యాక్ష‌న్ కూడా ఉండేలా చూసుకుంటాడు. చివ‌రిగా బాల‌య్య‌తో `భగవంత్ కేసరి` వంటి సెంటిమెంటల్‌ యాక్షన్‌ మూవీ కూడా చేశాడు. కూతురు సెంటిమెంట్‌తో ఈ మూవీని తెరకెక్కించి పెద్ద హిట్ కొట్టాడు. ప్ర‌స్తుతం విక్టరీ వెంక‌టేష్‌తో ఓ సినిమా చేస్తున్నాడు.

`ఎఫ్‌2, `ఎఫ్‌3` తర్వాత వీరి కాంబినేషన్‌లో రానున్న ఈ మూవీపై అంచ‌నాలు భారీగా ఉన్నాయి. అయితే అనీల్ రావిపూడి రీసెంట్‌గా `కృష్ణమ్మ` చిత్ర ప్రీ రిలీజ్‌‌ ఈవెంట్‌లో పాల్గొన్నారు. సత్యదేవ్‌ హీరోగా కొరటాల శివ నిర్మాణంలో వస్తోన్న ఈ చిత్రానిఇక గెస్ట్ గా వ‌చ్చి ఆస‌క్తిక‌ర వ్యాఖ్యలు చేశారు `దేవర` రిలీజ్‌ డేట్‌ని చెప్పాలని కొరటాల శివని, అలాగే మహేష్‌ బాబు సినిమా ఎప్పుడు ప్రారంభిస్తారో డేట్‌ని చెప్పాలని రాజమౌళిని డిమాండ్ చేస్తూ చాలా స‌ర‌దాగా మాట్లాడారు. మ‌రోవైపు ఐపీఎల్‌ క్రికెట్‌ మ్యాచ్‌ల వ‌ల‌న బాగున్న సినిమాలకు కూడా కలెక్షన్లు రాక‌పోవ‌డంతో ఐపీఎల్‌ చూడకపోతే కొంపలేమి మునిగిపోవు, వచ్చి సినిమాలు చూడండి, అవి రెండు మూడు రోజులు అటు ఇటు అయినా ఏం కాదు, ఫోన్‌లో స్కోర్‌ చూసుకోవచ్చు అని అన్నారు. దీనిపై కొంద‌రు నెటిజన్లు అనీల్ రావిపూడిని ట్రోల్స్ చేస్తూ రచ్చ చేస్తున్నారు.

ఈ క్ర‌మంలో అనీల్ రావిపూడి నేడు జ‌రిగిన డైరెక్టర్స్ డే సెల‌బ్రేష‌న్స్‌లో పాల్గొని మేము మే 19న డైరెక్టర్స్ డే సెలబ్రేషన్స్ చేస్తున్నాం. ఆ రోజు కూడా ఐపీఎల్ మ్యాచ్ ఉంది. నేను ఇటీవల ఐపీఎల్ గురించి మాట్లాడిన మాటలు తప్పుగా జ‌నాల‌లోకి వెళ్లాయి.నేను చెప్పేది ఏంటంటే…ఐపీఎల్ చూడండి, సినిమాలు కూడా చూడండి. నేనూ ఐపీఎల్ చూస్తాను. నేను మాట్లాడింది అపార్థం చేసుకోవద్దు అంటూ అభిమానుల‌కి తెలియ‌జేశారు. మ‌రి అనీల్ వివ‌ర‌ణ త‌ర్వాత అయిన ఈ వివాదం ముగుస్తుందా లేదా అనేది చూడాలి.