Mana Shakaravaraprasad garu | ‘మీసాల పిల్లా..’ :  చిరు-నయన్ జంట క్యూట్ కెమిస్ట్రీ

మెగాస్టార్ చిరంజీవి – అనిల్ రావిపూడి మూవీ “మన శంకర వరప్రసాద్ గారు” నుంచి ‘మీసాల పిల్లా..’ పాట ప్రోమో. చిరంజీవికి మళ్లీ ఉదిత్ నారాయణ్ గొంతుతో గత స్మృతులు

Mana Shakaravaraprasad garu | ‘మీసాల పిల్లా..’ :  చిరు-నయన్ జంట క్యూట్ కెమిస్ట్రీ

Chiranjeevi and Nayanthara’s Cute Chemistry in ‘Meesala Pilla..’ Promo Wins Fans

Mana Shakaravaraprasad garu | హైదరాబాద్, అక్టోబర్ 2 (విధాత): మెగాస్టార్ చిరంజీవి-అనిల్ రావిపూడి కాంబినేషన్‌లో తెరకెక్కుతున్న భారీ ఫ్యామిలీ ఎంటర్‌టైనర్ “మన శంకర వరప్రసాద్ గారు” ప్రమోషన్లు దసరా సందర్భంగా మొదలయ్యాయి. చిత్ర బృందం గురువారం “మీసాల పిల్లా..” అనే పాట తొలి ప్రోమోను విడుదల చేసింది. ఈ ప్రోమోలో చిరంజీవి, నయనతార జంట ముద్దుగా రొమాంటిక్ కెమిస్ట్రీతో ఆకట్టుకున్నారు.

ఈ పాటను బాలీవుడ్ టాప్ సింగర్ ఉదిత్ నారాయణ్ పాడటం స్పెషల్. 90’s, 2000లలో చిరంజీవి సినిమాలకు ఆయన గాత్రం మేజిక్‌ లాంటి హిట్ సాంగ్స్ ఇచ్చింది. “చూడాలని ఉందిలో “రామ్మా చిలకమ్మా”, డాడీ లో “వానా వానా వెన్నెల వానా” వంటి పాటలు ఇప్పటికీ అభిమానులను అలరిస్తుంటాయి. అదే లెజెండరీ వాయిస్ ఇప్పుడు మళ్లీ మెగాస్టార్ కోసం వినిపించడంతో అభిమానుల్లో గత మధుల స్మృతులు కదలాడాయి.

అనిల్ రావిపూడి ఫన్ స్టైల్ – భీమ్స్ మాస్ బీట్

“మీసాల పిల్లా..” ప్రోమోలో చిరంజీవి, నయనతార మధ్య సరదా సంభాషణలు, అనిల్ రావిపూడి ట్రేడ్‌మార్క్ వినోదం కనువిందు చేశాయి. “మా ఊర్లో పొగరుమోతు అమ్మాయిలను మీసాల పిల్ల అని పిలుస్తారు” అంటూ చిరంజీవి చెప్పే డైలాగ్ ఫ్యాన్స్‌ బాగా ఎంజాయ్​ చేసారు.

భాస్కరభట్ల సాహిత్యం, భీమ్స్ సిసిరోలియో మాస్ బీట్ కలయికతో ఈ పాట యువతను, కుటుంబ ప్రేక్షకులను అలరించేలా ఉందని మేకర్స్ చెబుతున్నారు. స్వరాలు కాస్త నవ్యతతో, కొంత ఓల్డ్​ బీట్​తో కలిసి సరికొత్తగా వినిపించాయి. ఈ పాటను శ్వేతా మోహన్ కూడా ఆలపించారు.

సంక్రాంతి 2026కి విడుదల కానున్న ఈ సినిమాలో చిరంజీవి, వెంకటేశ్​, నయనతార త్రయం కలిసి తెరపై సందడి చేయనున్నారు. షైన్​ స్క్రీన్స్​, గోల్డ్​బాక్స్​ ఎంటర్​టైన్​మెంట్స్​ బ్యానర్లపై సాహు గరపాటి, సుస్మిత కొణిదెల నిర్మిస్తున్న ఈ చిత్రానికి భీమ్స్ సంగీతం అందిస్తుండగా, సమీర్ రెడ్డి సినిమాటోగ్రఫీ, ఏఎస్ ప్రకాశ్ ఆర్ట్ వర్క్ చేస్తున్నారు.

“మన శంకర వరప్రసాద్ గారు” నుంచి రాబోయే మెలోడి, మాస్ సాంగ్స్‌తో ఆల్బమ్‌కి “మెగా గ్రేస్, మెగా క్లాస్, మెగా స్వాగ్, మెగా విక్టరీ” అనే థీమ్‌ని జోడించారని బృందం ప్రకటించింది. దసరా బహుమతిగా రిలీజ్ చేసిన ఈ ప్రోమో ఇప్పటికే సోషల్ మీడియాలో ట్రెండింగ్ అవుతోంది.