Mana Shankara Varaprasad Garu : మెగా 157 మూవీ టైటిల్ ‘మన శంకరవరప్రసాద్‌గారు’…చిరంజీవికి బర్త్ డే సర్ ఫ్రైజ్
చిరంజీవి మెగా 157 టైటిల్ ‘మన శంకరవరప్రసాద్‌గారు’ బర్త్ డే గిఫ్ట్‌గా విడుదలై టాలీవుడ్‌లో హైప్ క్రియేట్ చేసింది.

Mana Shankara Varaprasad Garu | విధాత: మెగాస్టార్ చిరంజీవి-దర్శకుడు అనిల్ రావిపూడి కాంబినేషన్ లో వస్తున్న మెగా 157మూవీ నుంచి చిరు బర్త్ డే సందర్భంగా శుక్రవారం చిత్ర బృందం కీలక అప్డేట్ విడుదల చేసింది. చిరంజీవి పుట్టినరోజు సందర్భంగా ఈ సినిమా టైటిల్ గ్లింప్స్‌ను విడుదల చేశారు. ఈ సినిమాకు ‘మన శంకరవరప్రసాద్‌గారు’ అనే టైటిల్ ను ఖరారు చేశారు. ‘పండగకి వస్తున్నారు’ అనేది ఉపశీర్షికగా ప్రకటించారు.
ఇకపోతే సినిమా టైటిల్ గ్లింప్స్ అదిరిపోయింది. బాస్ అన్న బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ తో చిరంజీకి కొత్త మేకోవర్ లో సూట్ లో స్టైల్ గా సిగరేట్ తాగుతూ..చేతిలో తుపాకితో ఓ సీన్ లో..గుర్రాన్ని పట్టుకుని సిగరేట్ కాలుస్తూ వింటేజ్ లుక్ లో మరోసీన్ లో కొత్తగా కనిపించారు. మన శంకర్ వరప్రసాద్ గారు పండగకి వస్తున్నారంటూ విక్టరీ వెంకటేష్ వాయిస్ ఒవర్ తో టైటిల్ అనౌన్స్ చేశారు.
మెగా 157మూవీకి చిరంజీవి అసలు పేరునే టైటిల్ గా ఎంచుకోవడం విశేషం. ఈ సినిమాలో చిరు సరసన నయనతార నటిస్తున్నారు. విక్టరీ వెంకటేష్ ప్రత్యేక పాత్రలో అలరించబోతున్నారు. ఈ సినిమా వచ్చే ఏడాది సంక్రాంతికి విడుదల కానుంది. ‘సంక్రాంతికి రప్ఫాడించేద్దాం’ అంటూ ఇప్పటికే ఈ సినిమాపై ఆసక్తి రేపిన డైరెక్టర్ అనిల్ రావిపూడి టైటిల్ గ్లింప్స్ తో మరింత హైప్ ఇచ్చారు. మొత్తానికి ‘సంక్రాంతికి మన శంకరవరప్రసాద్‌గారు రప్ఫాడించేయడం’ ఖాయంగానే కనిపిస్తోందంటున్నారు అభిమానులు.