Nayanthara First Look In Mana Shankara Vara Prasad Garu | మన శంకర్ వరప్రసాద్ నుంచి శశిరేఖ పరిచయం

మన శంకర్ వర ప్రసాద్ సినిమాలో నయనతార 'శశిరేఖ'గా ఫస్ట్ లుక్, సాంప్రదాయ చీరలో ముగ్దమైన లుక్ రిలీజ్, సినిమాపై అంచనాలు పెరగాయి."

Nayanthara First Look In Mana Shankara Vara Prasad Garu | మన శంకర్ వరప్రసాద్ నుంచి శశిరేఖ పరిచయం

విధాత : మెగాస్టార్ చిరంజీవి హీరోగా అనిల్ రావిపూడి దర్శకత్వంలో వస్తున్న లేటెస్ట్ మూవీ “మన శంకర వర ప్రసాద్ గారు ” నుంచి హీరోయిన్ నయనతార పాత్ర ఫస్ట్ లుక్ పోస్టర్ ను మేకర్స్ విడుదల చేశారు. విజయ దశమి సందర్భంగా లేడి సూపర్ స్టార్ నయనతార పాత్రను “శశిరేఖ”గా పరిచయం చేస్తూ ఫస్ట్ లుక్ పోస్టర్ ను విడుదలైంది. శశిరేఖగా నయనతార సాంప్రదాయ చీరకట్టులో ముగ్దమనోహరంగా చూడముచ్చటగా కనిపిస్తోంది. నయన తార పాత్ర లుక్ నయాననందకరంగా కనిపిస్తూ ఈ సినిమాపై అంచనాలను పెంచేసింది. ఈ సినిమాలో నయనతారతో పాటు కేథ‌రిన్ థ్రెసా కూడా ముఖ్య పాత్రలో కనిపించనున్నారు.

మరో వైపు నయనతార పాత్ర ఫస్ట్ లుక్ రిలీజ్‌తో పాటు, చిత్రబృందం మరో స్పెషల్ సర్‌ప్రైజ్‌ను కూడా దసరాకి రిలీజ్ చేయబోతున్నట్లు హింట్ ఇచ్చింది. ఇది చిరంజీవి పాత్ర లుక్ అయి ఉండవచ్చు అని..లేక సినిమాకు సంబంధించిన వీడియో క్లిప్ ఉండవచ్చు అని అభిమానులు భావిస్తున్నారు. షైన్ స్క్రీన్ సంస్థ “మన శంకర వర ప్రసాద్ గారు ” సినిమాను భారీ స్థాయిలో నిర్మిస్తోంది. సంగీతాన్ని భీమ్స్ సెసిరోలియో అందిస్తున్నారు. ఇప్పటికే భీమ్స్ ఈ చిత్రం కోసం మాస్ బీట్‌లతో మంచి ఆడియో అందించబోతున్నారని టాక్ తో మూవీపై భారీ అంచనాలు నెలకొన్నాయి. సంక్రాంతికి విడుదల కాబోతున్న ఈ సినిమా కోసం మెగాఫ్యాన్స్ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.