Mass Jathara | రవితేజ ‘మాస్‌ జాతర’ ఈ నెల 31న విడుదల

రవితేజ ‘మాస్‌ జాతర’ మూవీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమా అక్టోబర్ 31న థియేటర్లలో రాబోతుంది.

Mass Jathara | రవితేజ ‘మాస్‌ జాతర’ ఈ నెల 31న విడుదల

విధాత: రవితేజ, శ్రీలీల హీరో హీరోయిన్లుగా కొత్త దర్శకుడు భాను భోగవరపు తెరకెక్కించిన యాక్షన్ ఎంటర్ టైనర్ ‘మాస్‌ జాతర’ మూవీ విడుదల తేదీ ఖరారైంది. ఈ సినిమాను ఈ నెల 31న విడుదల చేస్తున్నట్లుగా చిత్ర బృందం ప్రకటించింది. ఈ విషయాన్ని ప్రకటిస్తూ స్పెషల్ వీడియోను పంచుకుంది. వీడియోలో హాస్య నటుడు హైపర్ ఆది మాస్ జాతర విడుదల ఎప్పుడంటూ రవితేజను అడుగుతాడు. సంక్రాంతికి అని చెప్పడంతో ఆది వెళ్లిపోవడం..సంక్రాంతికి సినిమా రాకపోవడంతో మరోసారి రవితేజాను కలువగా..వినాయక చవితికి పక్కా అంటాడు.

వినాయక చవితి అయిపోయాక మళ్లీ ఆది మాస్ జాతర విడుదల ఏమైందంటూ రవితేజను ప్రశ్నిస్తాడు. ఆక్టోబర్ 31న పక్కా అంటూ ఆది తెచ్చిన వినాయక విగ్రహం మీద ఒట్టేసి మరి రవితేజ కొత్త విడుదల తేదీని ప్రకటించడం ద్వారా సినిమా విడుదలపై వీడియోలో క్లారిటీ ఇచ్చారు.