Chhattisgarh : చత్తీస్‌గఢ్ లో మావోయిస్టుల భారీ డంప్ సీజ్

చత్తీస్‌గఢ్ బీజాపూర్‌లో మావోయిస్టుల భారీ ఆయుధాల డంప్ స్వాధీనం. RDx, గ్రనేడ్లు, పేలుళ్ల పరికరాలు లభ్యం.

Chhattisgarh : చత్తీస్‌గఢ్ లో మావోయిస్టుల భారీ డంప్ సీజ్

విధాత : చత్తీస్ గఢ్ బీజాపూర్ జిల్లా పామేడ్‌ కంచాల అటవీ ప్రాంతంలో మావోయిస్టులకు చెందిన భారీ డంప్ లభ్యమైంది. డంపలో బ్యారల్ గ్రానైడ్ లాంచర్స్, గన్ పౌడర్, ఎలక్ట్రిక్ డిటోనేటర్స్, సోలార్ ఇన్వర్టర్స్, పేలుడు పదార్థాలు లభ్యం అయ్యాయి. భారీ పేలుళ్లకు వినియోగించే ఆర్డీఎక్స్‌తో పాటు రైఫిల్ బయోనెట్‌లు, ఇనప రాడ్లు, కట్టర్లను కూడ స్వాధీనం చేసుకున్నారు. భద్రతా బలగాలు ప్రస్తుతం స్వాధీనం చేసుకున్న ఆయుధాల డంప్ ఛత్తీస్‌గఢ్ రాష్ట్ర చరిత్రలోనే అతి పెద్దదని పోలీసు అధికారులు వెల్లడించారు.

మావోయిస్టుల ఏరివేతకు చేపట్టిన ఆపరేషన్ కగార్‌లో భాగంగా చత్తీస్ గఢ్ లో భద్రతా బలగాలు చేపడుతోన్న వరుస కూంబింగ్ ఆపరేషన్లతో అటు ఎన్ కౌంటర్లు..లొంగుబాట్లతో పాటు ఇటు వారి ఆయుధ కర్మాగారాలు..డంప్ లు వెలుగుచూస్తున్నాయి. దీంతో మావోయిస్టు పార్టీ కూంబింగ్ ఆపరేషన్లతో భారీగా నష్టపోతూ ఆత్మరక్షణలో పడిపోతుంది.