Archana| మెసేజ్‌కి రిప్లై ఇవ్వనందుకు సినిమా నుండి ఔట్.. స్టార్ హీరోయిన్ ఆవేదన
Archana| తెలుగు అమ్మాయి వేద అర్చన గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె మంచి చిత్రాలలో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. `తపన` చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ నేను అనే సినిమాతో మెప్పించింది.. `కొంచెం టచ్‌లో వుంటే చెబుతాను` అనే చిత్రంతో కమర్షియల్‌గా విజయాన్ని అందుకుంది. ఇక `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`లో త్రిషకి ఫ్రెండ్ గా నటించి ఫిల్మ్ ఫేర్ అవార్డుని సై

Archana| తెలుగు అమ్మాయి వేద అర్చన గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఆమె మంచి చిత్రాలలో నటించి పేరు ప్రఖ్యాతలు సంపాదించుకుంది. `తపన` చిత్రంతో టాలీవుడ్‌లోకి హీరోయిన్‌గా ఎంట్రీ ఇచ్చిన ఈ భామ నేను అనే సినిమాతో మెప్పించింది.. `కొంచెం టచ్‌లో వుంటే చెబుతాను` అనే చిత్రంతో కమర్షియల్‌గా విజయాన్ని అందుకుంది. ఇక `నువ్వొస్తానంటే నేనొద్దంటానా`లో త్రిషకి ఫ్రెండ్ గా నటించి ఫిల్మ్ ఫేర్ అవార్డుని సైతం సొంతం చేసుకుంది. ఇక హీరోయిన్‌గా కొన్ని చిత్రాలలో నటించి అలరించిన ఈ భామ సెకండ్ లీడ్‌గా కూడా నటించి అలరించింది.
`శ్రీరామదాసు`, `పౌర్ణమి`, `సామాన్యుడు`, `యమదొంగ`, `పాండురంగడు`, `ఖలేజా`, `పరమవీర చక్ర`, `బలుపు`, `కమలతో నా ప్రయాణం`, `పంచమి`, `లయన్` వంటి సినిమాల్లో కనిపించి అలరించిన ఈ భామ ఇటీవల `కృష్ణమ్మ` సినిమాలోనూ చిన్న పాత్రలో మెరిసింది. అయితే 2019లో అర్చన .. జగదీష్ భక్తవత్సలంని వివాహం చేసుకోగా, ఆ తర్వాత సినిమాలు కాస్త తగ్గించింది. అడపాదడపా పలు ఇంటర్వ్యూలలో ఆసక్తికర విషయాలు వెల్లడిస్తూ హాట్ టాపిక్ అవుతుంది. అయితే తాజాగా ఓ హీరో తన మెసేజ్‌కి రిప్లై ఇవ్వనందుకు సినిమా నుంచి తీసేశారని తెలిపింది. మలయాళంలో, తెలుగులో ఇలాంటి అనుభవాలు తనకు ఉన్నట్టు స్పష్టం చేసింది.
అవార్డు ఈవెంట్‌లో ఓ హీరో తనకు అవార్డు ఇచ్చేందుకు కూడా ఇంట్రెస్ట్ చూపించలేదని, ఆమెకి అవార్డుని తాను ఇవ్వను అని స్టేజ్ నుండి దిగిపోయినట్టు కూడా వేద అర్చన తెలియజేసింది. సినిమా రంగంలో ఇలాంటివన్నీ కూడా కామన్ అని ఆమె పేర్కొంది. ఇక కొందరు ఈ అమ్మాయికి సినిమాలంటే ఇంట్రెస్ట్ ఉంది కదా, ఒకసారి టచ్ చేసి చూద్దాం, మెసేజ్ పెట్టి చూద్దాం, కుదిరితే ఆఫర్ ఇద్దాం అని ఆలోచిస్తుంటారు. ఇలాంటి వాళ్లు సినిమా పరిశ్రమలో ఉన్నందుకు చాలా అసహ్యం వేస్తుందని వేద ఆవేదన వ్యక్తం చేసింది. అలాంటి అనుభవాలని మా అమ్మతో కూడా షేర్ చేసుకునే దాన్ని. ఓ ఐదారేళ్ల తర్వాత ఓ అవగాహన, మెచ్చూరిటీ రావడంతో ఎలాంటి సినిమాలు చేయాలనే దానిపై పూర్తి క్లారిటీ కూడా తెచ్చుకున్నాను అని అర్చన స్పష్టం చేసింది.