Malliswari Movie|మ‌ల్లీశ్వ‌రి సినిమాలోని డైనింగ్ టేబుల్ స్టోరీ పెద్ద‌దే.. ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Malliswari Movie|మ‌ల్లీశ్వ‌రి.. ఈ సినిమాని చూసిన వారు ఎవ‌రు కూడా అంత తేలిగ్గా మ‌రిచిపోరు.2004, ఫిబ్రవరి 18న రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూనే ఉంటుంది. టీవీలో వ‌స్తే సినిమాని చూస్తూ నవ్వుకునే వాళ్లు ఎంతోమంది ఉన్నారు. అంతగా ఈ సినిమా ఆడియన్స్‌కి కనె

  • By: sn    cinema    Nov 06, 2024 1:12 PM IST
Malliswari Movie|మ‌ల్లీశ్వ‌రి సినిమాలోని డైనింగ్ టేబుల్ స్టోరీ పెద్ద‌దే.. ఏంటో తెలిస్తే ఆశ్చ‌ర్య‌పోతారు..!

Malliswari Movie|మ‌ల్లీశ్వ‌రి.. ఈ సినిమాని చూసిన వారు ఎవ‌రు కూడా అంత తేలిగ్గా మ‌రిచిపోరు.2004, ఫిబ్రవరి 18న రిలీజ్ అయిన ఈ చిత్రం ఇప్ప‌టికీ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూనే ఉంటుంది. టీవీలో వ‌స్తే సినిమాని చూస్తూ నవ్వుకునే వాళ్లు ఎంతోమంది ఉన్నారు. అంతగా ఈ సినిమా ఆడియన్స్‌కి కనెక్ట్ అయింది. ఈ సినిమాలో వెంకటేశ్ చేసిన కామెడీకి ఇప్పటికీ కడుపుబ్బా నవ్వుకుంటూనే ఉంటాం. బ్యాంక్‌లో ఉద్యోగం చేస్తున్నా, అంత జీతం వస్తున్నా పెళ్లికి పిల్లని ఎవడూ ఇవ్వడం లేదేంట్రా అంటూ వెంకీ ఏడ్చే ఏడుపు.. ఆఫీసులో అందరూ వెంకీపై వేసిన పంచులు.. ఇవ‌న్నీ కూడా ఆడియ‌న్స్‌కి మంచి వినోదం పంచాయి. ఇక ఈ సినిమాలో మల్లీశ్వరిగా కత్రినా కైఫ్ జీవించేసింది. తన అందం, నటనతో అందరినీ ఫిదా చేసింది.

ఈ సినిమాలో సునీల్, బ్రహ్మానందం కామెడీ కూడా నెక్స్ట్ లెవెల్ లో ఉంటుంది. అయితే ఓ సంద‌ర్భంలో చిత్ర డైరెక్టర్ కె. విజయ భాస్కర్ ఓ ఇంటర్వ్యూ లో మాట్లాడుతూ ఆస‌క్తిక‌ర కామెంట్స్ చేశారు. మల్లీశ్వరి సినిమా షూటింగ్ చేసిన లలిత మహల్ లో మీరందరు చూసిన డైనింగ్ టేబుల్ ఉండదు. నిజానికి మల్లీశ్వరి సినిమాలో డైనింగ్ టేబుల్ కి సంబందించిన సీన్స్ ఎక్కువగా ఉంటాయి. అందుకే ఈ సినిమా కోసం ఆ డైనింగ్ టేబుల్ ను స్వయంగా నిర్మాత సురేష్ దగ్గరుండి చేయించారు. ఈ సినిమా కోసమే దాన్ని అంత పెద్దగా చేయించారని చెప్పారు. ఈ డైనింగ్ టేబుల్ ద‌గ్గ‌ర బ్ర‌హ్మానందం, వెంక‌టేష్ చేసే కామెడీ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంటుంది.

ఈ సినిమాకి డైలాగ్స్, స్టోరీ చాలా అద్భుతంగా అందించారు త్రివిక్రమ్ శ్రీనివాస్. ఇప్పటికీ, ఎప్ప‌టికీ త్రివిక్రమ్ రాసిన గొప్ప సినిమాల్లో మల్లీశ్వరి కూడా ఒకటిగా నిలిచిపోతుంది. ఇక ఈ సినిమాకి కోటి ఇచ్చిన సంగీతం కూడా అంతే మధురంగా ఉంటుంది. సెకండాఫ్‌లో కనిపించేది కాసేపే అయిన సునీల్ చేసిన కామెడీ కూడా అదుర్స్ అని చెప్పాలి.. ముఖ్యంగా ఆ గడ్డి మేటు దగ్గర దెయ్యం కథ చెప్పే సన్నివేశం అయితే వేరే లెవల్. ఇలా సినిమాకి ప్ర‌తీది క‌లిసి రావ‌డంతో మ‌ల్లీశ్వ‌రి చిత్రం పెద్ద హిట్ అయింది.