Bigg Bos8|విష్ణు ప్రియ, గంగవ్వ మధ్య ఎమోషనల్ మాటలు.. హరికథ చెప్పిన హరితేజ
Bigg Bos8|బిగ్ బాస్ హౌజ్‌లో నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నామినేషన్ల ప్రక్రియలో కొందరు హర్ట్ కాగా, వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు కొందరు. ప్రేరణని నిఖిల్ పలకరించడమే కాక , విష్ణు ప్రియ మాటలకి తాను హర్ట్ అయినట్టు కూడా చెప్పాడు. అనంతరం విష్ణు ప్రియ.. గంగవ్వతో తన బాధలు చెప్పుకుంది. ఫ్యామిలీ కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. విష్ణు ప్రియని గంగవ్వ.. మీ నాన్న ఎక్కడ ఉంటాడు.. ఎం చేస్తుంటాడు..

Bigg Bos8|బిగ్ బాస్ (Bigg Boss)హౌజ్‌లో నామినేషన్ల పర్వం ముగిసింది. ఈ నామినేషన్ల ప్రక్రియలో కొందరు హర్ట్ కాగా, వారిని బుజ్జగించే ప్రయత్నాలు చేశారు కొందరు. ప్రేరణని నిఖిల్(Nikhil) పలకరించడమే కాక , విష్ణు ప్రియ(Vishnu Priya) మాటలకి తాను హర్ట్ అయినట్టు కూడా చెప్పాడు. అనంతరం విష్ణు ప్రియ.. గంగవ్వతో తన బాధలు చెప్పుకుంది. ఫ్యామిలీ కష్టాల గురించి చెబుతూ ఎమోషనల్ అయింది. విష్ణు ప్రియని గంగవ్వ.. మీ నాన్న ఎక్కడ ఉంటాడు.. ఎం చేస్తుంటాడు.. మీకు అండగా ఉండడా అని ప్రశ్నించింది. దీనికి విష్ణుప్రియ బదులిస్తూ నాన్న ఊర్లో ఉంటారు. మా అమ్మకి వాళ్ళతో మాట్లాడడం ఇష్టం లేదు అని పేర్కొంది.. దీంతో గంగవ్వ కన్నీరు పెట్టుకున్నారు. అమ్మనాన్న విడిపోవడం నన్ను చాలా డిస్ట్రబ్ చేసింది అంటూ విష్ణు ఎమోషనల్ అయింది.
రోహిణి రచ్చ..
ఇక నామినేషన్స్ తో గీటెక్కిన బిగ్ బాస్ తర్వాత కాస్త సందడిగా సాగింది. అనంతరం అన్‍లిమిటెడ్ రేషన్ కావాలని నబీల్ కోరాడని, ఈ వారానికి అది నెరవేరుస్తానని బిగ్‍బాస్ చెప్పారు. అయితే దీని కోసం హౌస్‍లో ఉన్నంతకాలం నబీల్ స్వీట్లు తినకూడదంటూ బిగ్ బాస్ చెప్పారు. అలా చేస్తే మెగాచీఫ్ మహబూబ్.. అన్‍లిమిటెడ్ రేషన్ తీసుకోవచ్చని చెప్పారు. ఈ వారం తాను సేవ్ అయితే బంగారు ముక్కు పుడక ఇస్తానని గంగవ్వ(Gangavva)తో మణికంఠ చెప్పారు. హరితేజ బంగారు వడ్డాణం అడిగితే.. బేగంబజార్‌కు వెళ్లి ఇస్తానని అన్నారు. రోహిణి అడిగితే.. లిప్‍స్టిక్, ముద్దు ఇస్తానని మణి చెప్పారు. తులం బంగారం కావాలని గంగవ్వ అడిగితే హౌజ్‌లో ఉండే ప్రతి వారానికి అరతులం ఇస్తానంటూ నబీల్ చెబుతాడు. ఇక రోహిణి(Rohini) తన చేష్టలతో తెగ నవ్వించేసింది.
గారు. మొత్తంగా హౌస్‍లో ఉండే ప్రతీ వారానికి అర తులం బంగారం ఇస్తానని గంగవ్వకు మణి మాట ఇచ్చారు. ఇక 2050వ సంవత్సరంలో పరిస్థితి ఎలా ఉంటుందో కంటెస్టెంట్లకు కథ చెప్పారు బిగ్‍బాస్. ఆ తర్వాత ఆ సంవత్సరంలో ఉన్నామనుకోవాలని చెప్పారు. రాయల్ టీమ్‍ను ఓవర్ స్మార్ట్ ఫోన్స్ టీమ్‍గా బిగ్‍బాగ్ చెప్పారు. ఓజీ క్లాన్ సభ్యులను ఓవర్ స్మార్ట్ చార్జర్లుగా నియమించారు.అనంతరం టాస్క్‌లు టఫ్‌గా సాగాయి. ఇంతలోనే చార్జింగ్ కోసం ఓవర్ స్మార్ట్ చార్జర్ మణికంఠను కాకాపట్టారు హరితేజ(Hari Teja). హౌస్‍లో మణికంఠ జర్నీ గురించి హరికథ పాడారు హరితేజ. ఈ హరికథతో మణిని ఇంప్రెస్ చేశారు. దీంతో తన వైర్‌తో హరితేజకు ఒక నిమిషం చార్జింగ్ ఇచ్చారు మణి. హరితేజ బ్యాటరీ పెరిగింది. ఆమె డ్యాన్స్ చేశారు. చార్జింగ్ కోసం ప్రయత్నించే క్రమంలో నయని పావనికి గాయం అయింది.