Bigg Boss8| ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో రెండు హౌజ్‌లా.. కంటెస్టెంట్ల పేర్లు లీక్ చేసిన మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్..!

Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌కి విపరీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తెలుగులో ఈ షోకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. సీజన్ 7కి విపరీత‌మైన ఆద‌ర‌ణ ద‌క్క‌డంతో సీజ‌న్ 8 కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు నిర్వాహ‌కులు సైతం సీజ‌న్ 8ని ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ని మించి ఉండేలా రూపొందిస్తున్నారు. జులై 21న నాగార్జున బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో లాంచ్ కాగా, దానికి అన్ లిమిటెడ్ వినోదం పంచేందుకు తిరి

  • By: sn    cinema    Jul 24, 2024 11:55 AM IST
Bigg Boss8| ఈ సారి బిగ్ బాస్ హౌజ్‌లో రెండు హౌజ్‌లా.. కంటెస్టెంట్ల పేర్లు లీక్ చేసిన మాజీ బిగ్ బాస్ కంటెస్టెంట్..!

Bigg Boss8| బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్‌కి విపరీత‌మైన ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంటుంది. తెలుగులో ఈ షోకి మంచి ఆద‌ర‌ణ ల‌భిస్తుంది. సీజన్ 7కి విపరీత‌మైన ఆద‌ర‌ణ ద‌క్క‌డంతో సీజ‌న్ 8 కోసం చాలా ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. మ‌రోవైపు నిర్వాహ‌కులు సైతం సీజ‌న్ 8ని ప్రేక్ష‌కుల అంచ‌నాల‌ని మించి ఉండేలా రూపొందిస్తున్నారు. జులై 21న నాగార్జున బిగ్ బాస్ సీజన్ 8 ప్రోమో లాంచ్ కాగా, దానికి అన్ లిమిటెడ్ వినోదం పంచేందుకు తిరిగి వస్తున్నామని కామెంట్ జోడించారు. దీంతో షోని ఎలా ప్లాన్ చేస్తున్నారా అని ఆలోచ‌న‌లు చేస్తున్నారు. సీజ‌న్ 7లో లాంచింగ్ ఎపిసోడ్స్ రెండు నిర్వహించడం బాగానే ప్ల‌స్ అయంది. ఫ‌స్ట్ లాంచింగ్ స‌మ‌యంలో హౌజ్‌లోకి 14 మందిని పంపారు. ఐదు వారాల తర్వాత మినీ లాంచ్ ఈవెంట్ నిర్వహించి మరో 5 మంది కంటెస్టెంట్స్ ని హౌస్లోకి పంపారు. ఇది టీఆర్పీ పరంగా కలిసొచ్చింది.

ఇక సీజ‌న్ 8లో రెండు హౌసులు ఉంటాయట. ఒకటి మెయిన్ హౌస్ కాగా, రెండోది లూప్ హౌస్. మెయిన్ హౌస్లోకి చేరుకోవాలి అంటే కంటెస్టెంట్స్ గేమ్స్, టాస్క్స్ లో సత్తా చాటాల్సి ఉంటుంది. ఇక మెయిన్ హౌజ్‌లోకి వ‌చ్చిన వారే బిగ్ బాస్ షోలో తమ జర్నీ కన్ఫర్మ్ చేకుంటారట. ఈ రెండు ఇళ్ల మధ్యలో ఒక పద్మవ్యూహం అనే కాన్సెప్ట్ కూడా పెట్టారట. ఇక మెయిన్ హౌజ్‌లో చివ‌రిగా మిగిలిన వారే విజేత‌గా నిలుస్తారు. ఇక బిగ్ బాస్ సీజ‌న్ 8లో కంటెస్టెంట్స్‌గా ఎవ‌రు పాల్గొంటార‌నేది ప్ర‌స్తుతానికి సస్పెన్స్. ఇప్పటి వరకు ప్రచారంలో ఉన్న వారిలో యాంకర్‌ వింధ్యా, విష్ణు ప్రియా, ప్రియాంక జైన్ బాయ్‌ ఫ్రెండ్‌ శివ, యాంకర్ నిఖిల్‌, బంచిక్‌ బబ్లూ, సుప్రీత, అమర్‌ దీప్‌ భార్య తేజూ, సీనియర్‌ హీరోయిన్‌ దీపికా, శ్వేతా నాయుడు, సీరియల్‌ నటుడు ఇంద్రనీల్‌, కమెడియన్‌ సద్దాం, యాదమ్మ రాజు, కుషితా కల్లాపు, రీతూచౌదరి, కిర్రాక్ ఆర్పీ, మై వీలేజ్‌ షో అనిల్‌, సాయికిరణ్‌, నటి సనా, శీతల్‌ గౌతమ్ ల‌తో పాటు వినోద్ కుమార్ పేరు కూడా ప్ర‌ధానంగా వినిపిస్తుంది.

తాజాగా బిగ్ బాస్ మాజీ కంటెస్టెంట్ సోహైల్ సీజన్ 8లో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి లీక్ చేశాడు.ఈ షో గ్రేట్ ఎక్స్‌పీరియెన్స్. మ‌నిషి రియాలిటీని టీవీలో చూడ‌డం చాలా బాగుంటుంది. ఇక ఈ షోలో పాల్గొనే కంటెస్టెంట్స్ గురించి త‌న‌కు తెలియ‌ద‌ని, తన ఫ్రెండ్స్ ఇద్దరు మాత్రం బాగా ట్రై చేస్తున్నట్టు తెలిపారు. నజీమ్‌ అనే అబ్బాయి ఫోన్‌ చేస్తున్నాడని, సింగర్‌ అఫ్రజ్‌ అలీ బిగ్ బాస్‌ షో నిర్వహకులకు చెప్పమని అడుగుతున్నారని, వాళ్లు వ‌స్తారో రారో తెలియ‌ద‌ని అన్నాడు. బిగ్ బాస్ షోలోకి వెళ్లడానికి రిక‌మండేష‌న్ ప‌ని చేయ‌ద‌ని, పరిచయంతో తెలిసినవాళ్ల‌కి చూడండి అన్నా అని మాత్రమే చెబుతామని, వాళ్లని తీసుకుంటారా? లేదా అనేది వారి ఇష్ట‌మేనంటూ సోహైల్ స్ప‌ష్టం చేశాడు.