Bigg Boss8|మ‌ళ్లీ య‌ష్మీ వెన‌క ప‌డుతున్న గౌతమ్.. నిఖిల్ కన్నీళ్లు పెట్టాడు..!

Bigg Boss8|బిగ్ బాస్ హౌజ్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. అప్ప‌టి వ‌ర‌కు మిత్రులుగా ఉన్న వారు శ‌త్రువులు అవుతున్నారు. యష్మీ ప్రవర్తనతో చాలా మంది విసిగిపోతున్నారు. గ‌త ఎపపిసోడ్‌లో గౌతమ్, నిఖిల్ మధ్య జరిగిన గొడవతో బిగ్ బాస్ హౌజ్ చాలా డిస్ట్ర‌బ్ అయింది. యష్మీ

  • By: sn    cinema    Oct 31, 2024 7:43 AM IST
Bigg Boss8|మ‌ళ్లీ య‌ష్మీ వెన‌క ప‌డుతున్న గౌతమ్.. నిఖిల్ కన్నీళ్లు పెట్టాడు..!

Bigg Boss8|బిగ్ బాస్ హౌజ్‌లో ఎప్పుడు ఏం జ‌రుగుతుందో ఎవ‌రికి అర్ధం కావ‌డం లేదు. అప్ప‌టి వ‌ర‌కు మిత్రులుగా ఉన్న వారు శ‌త్రువులు అవుతున్నారు. యష్మీ ప్రవర్తనతో చాలా మంది విసిగిపోతున్నారు. గ‌త ఎపపిసోడ్‌లో గౌతమ్, నిఖిల్ మధ్య జరిగిన గొడవతో బిగ్ బాస్ హౌజ్ చాలా డిస్ట్ర‌బ్ అయింది. యష్మీ, ప్రేరణపై నిఖిల్ ఒక మృగంలా దాడి చేసి దారుణంగా ప్ర‌వ‌ర్తించాడు. దీని గురించి యష్మీ(Yashmi), ప్రేరణ మాట్లాడుకుంటుంటే అది తలుచుకుని నిఖిల్ ఏడ్చాడు. హరితేజతో ఫిజికల్ అవ్వొద్దని గౌతమ్‌కు చెబితే.. రూల్స్ బుక్‌లో ఉందా. దమ్ముంటే నువ్ ఆడు అని విసిరేసాడు. “నేను అనేది సంచాలక్‌ను రెస్పెక్ట్ చేయాలని మనమే కదా లాస్ట్ వీక్ ఫైట్ చేశాం. ఇప్పుడు నువ్వే వినకుంటే ఎలా” అని యష్మీ అంది. “నాకు మొదట వినపడలేదు. వింటే ఎందుకు చేస్తాను” అని నిఖిల్ అన్నాడు. “అంతా ఒక్కటై ఆడారు.

నేను ఒక్కన్ని అయ్యాను. ఇక నుంచి నా గేమ్ నేను ఆడతాను” అని కన్నీళ్లు పెట్టుకున్నాడు. హగ్ చేసుకుంటానని యష్మీ అంటే వద్దని గట్టిగానే చెప్పాడు.ఇక చాలు అని ఎవరి ఫ్రెండ్షిప్ వద్దన్నట్లుగా నిఖిల్ ఫైర్ అయ్యాడు. పక్కనే పృథ్వీ(Prithvi) కూడా ఉన్నాడు. నిఖిల్ వెళ్లాక.. పృథ్వీని పట్టుకుని యష్మీ ఏడ్చేసింది. “కావాలని ఎవరు చేయలేదు కదరా” అంటూ ఏడ్చేసింది యష్మీ. ఆ త‌ర్వాత యష్మికి చాలా దురంగా జరిగుతూ నేను నాకోసం ఆడుతాను.. ఏమైనా పర్సనల్ ఉంటే బయటకు వెళ్లాక చూసుకుంటాను అంటూ కన్నీళ్ళు పెట్టుకుంటాడు నిఖిల్. అందులో ప్రేరణ అన్న ఓ మాటలకు అతను బాధపడుతుంటాడు. ఇక నిఖిల్ తనను పట్టించుకోకపోవడంతో యష్మీ బోరున ఏడుస్తుంటుంది.

ఛాన్స్ దొర‌కింది క‌దా అని గౌత‌మ్ మళ్ళీ యష్మీని లైన్ లో పెట్టడానికి ట్రై చేస్తుంటాడు. ఇక ఇప్పటి వరకూ పెట్టిన టాస్క్ లలో బ్లూ టీమ్ రెండు, గ్రీన్ టీమ్ ఒకటి, రెడ్ టీమ్ ఒక టాస్క్ ను విన్ అయ్యారు. ఇక యష్మీవిషంలో నిఖిల్(Nikhil) ముందు ముందు ఎలా ఉంటాడో చూడాలి. ఇక హౌస్ లో మిగిలిన వన్నీ జరుగిపోతూనే ఉన్నాయి. పృధ్వీ వెనకాలే తిరుగుతుంది విష్ణు ప్రియ. ఇక హౌజ్‌లో ఎప్ప‌టి మాదిరిగానే ఏడుపుల బాగోతం న‌డుస్తుంది. వారిని ప‌క్క‌న వారు ఓదారుస్తూ వ‌స్తున్నారు.