Bigg Boss8| ఈ సారి సీరియ‌ల్ స్టార్స్‌కి పెద్ద పీట‌.. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ మొత్తం లీక్..!

Bigg Boss8|బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా ఏడు సీజ‌న్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఎనిమిదో సీజ‌న్ జ‌రుపుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవ‌ల సీజ‌న్ 8కి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా రావ‌డంతో ఇప్పుడు ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవ‌రు అనే దానిపై జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. ఈ క్రమంలో హౌజ్‌లో 17 మంది పాల్గొన‌బోతున్నార‌ని, వారిలో ఎక్కువ మంది సీరియ‌ల్ స్టార్స్ ఉన్నారని టాక్ న‌డుస్తుంది. సెప్టెంబర్ 1వ

  • By: sn    cinema    Aug 26, 2024 6:47 AM IST
Bigg Boss8| ఈ సారి సీరియ‌ల్ స్టార్స్‌కి పెద్ద పీట‌.. బిగ్ బాస్ 8 కంటెస్టెంట్స్ మొత్తం లీక్..!

Bigg Boss8|బుల్లితెర బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్ కార్య‌క్ర‌మం తెలుగులో స‌క్సెస్ ఫుల్‌గా ఏడు సీజ‌న్స్ పూర్తి చేసుకుంది. ఇప్పుడు ఎనిమిదో సీజ‌న్ జ‌రుపుకునేందుకు సిద్ధంగా ఉంది. ఇటీవ‌ల సీజ‌న్ 8కి సంబంధించిన ప్ర‌క‌ట‌న కూడా రావ‌డంతో ఇప్పుడు ఇందులో పాల్గొనే కంటెస్టెంట్స్ ఎవ‌రు అనే దానిపై జోరుగా చ‌ర్చ న‌డుస్తుంది. ఈ క్రమంలో హౌజ్‌లో 17 మంది పాల్గొన‌బోతున్నార‌ని, వారిలో ఎక్కువ మంది సీరియ‌ల్ స్టార్స్ ఉన్నారని టాక్ న‌డుస్తుంది. సెప్టెంబర్ 1వ తేదీ సాయంత్రం 7 గంటలకు సీజన్ 8 మొదటి ఎపిసోడ్ ప్రసారం అవుతుంది. కంటెస్టెంట్స్ ఎంపిక దాదాపు పూర్తి కాగా, హౌజ్‌లో అడుగుపెడుతున్న‌ 17 మంది సెలెబ్స్ పేర్లు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.


బిగ్ బాస్ షో నిబంధనల ప్రకారం లాంచింగ్ ఎపిసోడ్ వ‌ర‌కు కంటెస్టెంట్స్ ఎవ‌రు అనేది ప్ర‌క‌టించ‌కూడ‌దు. హౌజ్‌లోకి వ‌చ్చే వారు కూడా ఎక్క‌డ రివీల్ చేయ‌కూడ‌దు. అయితే ప‌లు కార‌ణాల వ‌ల‌న కంటెస్టెంట్స్ పేర్లు లీక్ అవుతుండ‌డం మ‌నం గ‌మ‌నించ‌వ‌చ్చు. ఈ సారి సోషల్ మీడియా స్టార్స్ కోటాలో బెజవాడ బేబక్క, బంచిక్ బబ్లు ఎంపికయ్యారట. జబర్దస్త్ ఫేమ్ పవిత్ర, కమెడియన్ యాదమ్మ రాజు లకు అవకాశం దక్కిందట. ఇద్దరు వెండితెర నటులు ఎంట్రీ ఇస్తున్నారట. వారిలో ఒకరు క్యారెక్టర్ ఆర్టిస్ట్ సన. ఈమె చాలా కాలంగా టాలీవుడ్ లో రాణిస్తుంది. లాహిరి లాహిరి లాహిరి మూవీ ఫేమ్ ఆదిత్య ఓం సైతం సీజన్ కి ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ లో ఉన్నాడట. యాంకర్స్ సౌమ్యరావు, రీతూ చౌదరి కూడా ఎంపికైనట్టు టాక్ న‌డుస్తుంది.

బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి ఎంపికైన కంటెస్టెంట్స్ లిస్ట్ మొత్తం చూస్తే… రీతూ చౌదరి ,సుబ్బు ,అభిరామ్ వర్మ,తేజస్విని గౌడ ,,నిఖిల్ ,యాదమ్మ రాజు ,సీత , సింగర్ సాకేత్, యష్మి గౌడ, సన ,బెజవాడ బేబక్క, పవిత్ర , ఇంద్రనీల్ , ఆదిత్య ఓం , బంచిక్ బబ్లు , సౌమ్యరావు ఇలా 17 మందిని హౌజ్‌లోకి ప్ర‌వేశ పెట్ట‌బోతున్నార‌ని జోరుగా టాక్ న‌డుస్తుంది. మ‌రి ఇందులో నిజం ఎంత ఉంది అనేది తెలియాలంటే లాంచింగ్ ఎపిసోడ్ వ‌ర‌కు ఆగాల్సిందే.