Bigg Boss8| బిగ్ బాస్ 8పై అఫీషియల్ అనౌన్స్‌మెంట్.. లోగో అదిరిపోయింది..!
Bigg Boss8| బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకి అన్ని ప్రాంతీయ భాషలలో విపరీతమైన ఆదరణ లభిస్తుంది.మరో 50 రోజుల్లో స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానుందని తెలుస్తుంది. ‘కిర్రాక్ బా

Bigg Boss8| బుల్లితెర ప్రేక్షకులని ఎంతగానో అలరిస్తున్న బిగ్ రియాలిటీ షో బిగ్ బాస్. ఈ కార్యక్రమం ఎంత సక్సెస్ అయిందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. ఈ షోకి అన్ని ప్రాంతీయ భాషలలో విపరీతమైన ఆదరణ లభిస్తుంది.మరో 50 రోజుల్లో స్టార్ మా ఛానల్‌లో ప్రసారం కానుందని తెలుస్తుంది. ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’ ముగియగానే బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం కాబోతుంది. అంటే ఆగష్టు 24,25 ఎపిసోడ్‌లతో ‘కిర్రాక్ బాయ్స్ ఖిలాడి గర్ల్స్’ ముగియ నుండగా.. ఆ తరువాత వారం సెప్టెంబర్ 1 ఆదివారం నుంచి బిగ్ బాస్ సీజన్ 8 ప్రారంభం అయ్యే అవకాశాలు కనిపిస్తున్నాయి. గత కొద్ది రోజులుగా బిగ్ బాస్ సీజన్ 8కి సంబంధించి అనేక వార్తలు నెట్టింట హల్‌చల్ చేస్తున్నాయి.
టీవీ స్టార్స్‌తో పాటు కొందరు సినిమా నటీనటులు కూడా కంటెంస్టెంట్స్‌గాఈ షోకి ఎంట్రీ ఇచ్చే అవకాశం ఉన్నట్లు ప్రచారం జరిగింది.. ఇటీవలే శశిమధనం తెలుగు వెబ్‌సిరీస్‌తో ప్రేక్షకుల ముందుకొచ్చిన సోనియా సింగ్ బిగ్‌బాస్‌లోకి కంటెస్టెంట్‌గా అడుగుపెట్టనున్నట్లు టాక్ . అలానే విడాకులు తీసుకొని వార్తల్లో నిలిచిన యూట్యూబర్ నేత్రతో పాటు ఆమె మాజీ భర్త వంశీ కూడా బిగ్‌బాస్ 8లో పాల్గొనే అవకాశం ఉందని చెప్పుకొచ్చారు. ఇక జబర్ధస్త్ నుండి పలువురు నటీనటులు కూడా షోలో పాల్గొనబోతున్నట్టు ప్రచారం నడిచింది. గత సీజన్ రన్నరప్ అమర్ దీప్ భార్య తేజశ్వి గౌడ పేరు కూడా వినిపిస్తోంది.
వేణుస్వామి , ఇన్ ఫ్లుఎన్సర్స్ కుమారీ ఆంటీ, బర్రెలక్క, సామ్రాట్ ఇలా పలువురు బిగ్ బాస్ సీజన్ 8లో పాల్గొనబోతున్నట్టు సమాచారం. అయితే కొద్ది సేపటి క్రితం బిగ్‌బాస్ సీజన్ 8 కొత్త లోగో రివీల్ చేస్తూ అసలు ప్రోమో రిలీజ్ చేశాడు నాగార్జున.ఎంటర్టైన్మెంట్ తీసుకువచ్చేందుకు మేము రెడీ.. అంతులేని వినోదాన్ని ఆనందించేందుకు మీరు రెడీయా ? అంటూ కొత్త లోగోను నాగార్జున రివీల్ చేయగా, కొత్త లోగో కలర్ ఫుల్ గా ఉండి ఆకట్టుకుంటుంది. గతంలో కన్నా ఈ లోగో అందరిని ఆకట్టుకుంటుంది. నాన్ స్టాప్ ఎంటర్ టైన్మెంట్ అనే అర్థం వచ్చేలా ఇన్ఫినిటీ సింబల్ ని చూపించి ఆ తర్వాత దానిని 8గా మార్చారు.