Bigg Boss8|మణికంఠ సెల్ఫ్ ఎలిమినేట్.. అందుకు కారణం ఏంటంటే..!
Bigg Boss8| బిగ్ బాస్ తెలుగు సీజన్ 8 సక్సెస్ ఫుల్‌గా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఏడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరు తెగ డిస్కషన్స్ పెట్టారు. చివరికి నాగ మణికంఠ బిగ్ బాస్ హౌజ్‌ని వీడాడు. గత రెండు రోజులుగా నాగ మణికంఠ నా వల్ల కావట్లేదు వెళ్ళిపోతాను అని చెప్పడంతో బిగ్ బాస్ హౌ

Bigg Boss8| బిగ్ బాస్ తెలుగు(Bigg Boss Telugu) సీజన్ 8 సక్సెస్ ఫుల్‌గా ఏడు వారాలు పూర్తి చేసుకుంది. ఏడో వారం ఎవరు ఎలిమినేట్ అవుతారా అని అందరు తెగ డిస్కషన్స్ పెట్టారు. చివరికి నాగ మణికంఠ బిగ్ బాస్ హౌజ్‌ని వీడాడు. గత రెండు రోజులుగా నాగ మణికంఠ నా వల్ల కావట్లేదు వెళ్ళిపోతాను అని చెప్పడంతో బిగ్ బాస్ హౌజ్‌ని అతను వీడాల్సి వచ్చింది. బిగ్ బాస్ తెలుగు 8 సీజన్‌లో ఇప్పటి వరకు వరుసగా బెజవాడ బేబక్క, ఆర్జే శేఖర్ బాషా, అభయ్ నవీన్, సోనియా ఆకుల, ఢీ డ్యాన్సర్ నైనిక అనసురు, కిర్రాక్ సీత్ ఎలిమినేట్ కాగా,వారి జాబితాలో మణికంఠ కూడా చేరాడు. అయితే మణికంఠ ప్రేక్షకుల ఓటింగ్ ప్రకారం కాకుండా తనకు తాను సెల్ఫ్ ఎలిమినేట్ (Self Eliminate)కావడం కొసమెరుపు.
ఓటింగ్ ప్రకారం అందరిని సేవ్ చేసుకుంటూ వచ్చిన నాగార్జున డేంజర్‌జోన్‌లో గౌతమ్, మణికంఠ ఉన్నట్టు తెలిపాడు. అయితే మణకంఠ గేమ్ ఆడడం తన వల్ల కాదని చెప్పాడు.వెళ్లిపోతానంటూ మొండి పట్టు పట్టడంతో చేసేదేం లేక హౌజ్ నుండి బయటకి తీసుకొచ్చారు. ఇక హౌజ్‌లో ఉన్నన్ని రోజులు మణికంఠ విపరీతమైన ట్రోలింగ్ (Trolling)కూడా ఎదుర్కొన్నాడు. మణికంఠ పాట పాడటం, విగ్గు పీక్కోవడం, భార్యాపిల్లలు గుర్తుకు వస్తున్నారని చెప్పడంతో అతనిపై కొంత ట్రోలింగ్ జరిగింది. సింపథీ గేమ్ ఆడుతున్నాడని హౌజ్‌మేట్స్ కూడా అతనిని తిట్టిపోసారు. కాని తర్వాత తర్వాత అతను మెరుగుపరచుకుంటూ వచ్చాడు.
ఏడో వారం తక్కువ ఓట్లు సంపాదించుకున్న గౌతమ్ ఎలిమినేషన్ కావల్సి ఉండగా, మణికంఠ పదే పదే తాను వెళతానని చెప్పడంతో హౌజ్ నుండి బయటకు తీసుకొచ్చారు. నాగమణికంఠ స్టేజిపైకి వచ్చాక నాగార్జున నీకు ఓట్లు వేసిన వాళ్లకు ఏం చెప్తావు అని అడగ్గా.. నాకు ఓట్లు వేసిన వాళ్లందరికీ సారీ. నేను మిమ్మల్ని ఏదో రకంగా ఎంటర్టైన్ చేయడానికి ప్రయత్నిస్తాను. నాకు నా ఆరోగ్యమే ముఖ్యం. ఆరోగ్యమే మహాభాగ్యం. లక్ష్మీదేవి కంటే కూడా ఆరోగ్యమే ముఖ్యం అందుకే వచ్చేసాను అని వివరణ ఇచ్చాడు. ఇక బిగ్ బాస్ హౌజ్‌లో ఏడు వారాలు ఉన్న మణికంఠ ఎంత రెమ్యునరేషన్ తీసుకున్నాడు అంటే సుమారుగా రూ. 8,40,000 రెమ్యునరేషన్ అందినట్లు సమాచారం. అయితే, బిగ్ బాస్ తెలుగు 8 సీజన్స్‌లోని అందరి కంటెస్టెంట్లతో పోల్చుకుంటే నాగ మణికంఠే తక్కువ రెమ్యునరేషన్(Remuneration) తీసుకున్నట్లు తెలుస్తోంది.