Bigg Boss8|ఎలిమినేషన్‌లో బిగ్ ట్విస్ట్.. అతనిని కాపాడేందుకు వేరే వారిని ఎలిమినేట్ చేస్తున్నారా..!
Bigg Boss8|బిగ్ బాస్ (Bigg Boss)సీజన్ 8 కార్యక్రమం రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కొట్లాటలు, తిట్టుకోవడాలు, ప్రేమాయణాలు ఇలా ఒకటేంటి అనేక వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. అయితే వారం అంతా కష్టపడి అనేక టాస్క్‌లు ఆడే కంటెస్టెంట్స్ శనివారం నుండి కాస్త టెన్షన్ పడుతూ ఉంటారు. అందుకు

Bigg Boss8|బిగ్ బాస్ (Bigg Boss)సీజన్ 8 కార్యక్రమం రోజు రోజుకి రసవత్తరంగా మారుతుంది. కొట్లాటలు, తిట్టుకోవడాలు, ప్రేమాయణాలు ఇలా ఒకటేంటి అనేక వేరియేషన్స్ కనిపిస్తున్నాయి. అయితే వారం అంతా కష్టపడి అనేక టాస్క్‌లు ఆడే కంటెస్టెంట్స్ శనివారం నుండి కాస్త టెన్షన్ పడుతూ ఉంటారు. అందుకు కారణం ఆదివారం ఎలిమినేషన్స్. ఒక్కోసారి ఊహించని విధంగా కూడా ఎలిమినేషన్(Elimination) జరుగుతూ ఉంటుంది. ఏడో వారం హరితేజ, ప్రేరణ, నిఖిల్, పృథ్వీరాజ్, గౌతమ్ కృష్ణ, యష్మి గౌడ, నబీల్ అఫ్రిది, టేస్టీ తేజా, నాగ మణికంఠలతో కలిపి మొత్తం 9 మంది నామినేషన్స్‌లో నిలిచారు.
సోషల్ మీడియాలో అనధికారికంగా జరుగుతున్న ఓటింగ్‌ను బట్టి నబిల్ అఫ్రిదిని వెనక్కి నెట్టి ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్‌గా నిలిచాడు నిఖిల్. నబిల్‌కు 17.48 శాతం ఓటింగ్ నమోదవ్వగా.. నిఖిల్ 19.24 శాతం ఓట్లతో నిలిచాడు. టేస్టి తేజ, అవినాష్ చివరిలో ఉన్నారని, వారిద్దరిలో ఒకరు హౌజ్ నుండి ఎలిమినేట్ కావడం ఖాయమనే వార్తలు వచ్చాయి. కట్ చేస్తే బిగ్ బాస్ హౌస్ ఏడో వారం అనూహ్యంగా మణికంఠ(Manikanta) ఎలిమినేట్ అయ్యి బయటకు వచ్చేసినట్టు తెలుస్తోంది. అత్యంత విశ్వసనీయ వర్గాల సమాచారం ప్రకారం మణింకఠ బిగ్ బాస్ హౌస్ ను వీడి బయటకు వచ్చేసినట్టు టాక్ నడుస్తుంది. మణికంఠ ఎలిమినేషన్ అన్ ఫెయిర్ అంటూ కొందరు నెటిజన్స్ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు.
ఓటింగ్‌లో మణికంఠ ముందు ఉన్నా కూడా టేస్టి తేజని కాపాడేందుకు మణికంఠని బయటకు పంపించారనే టాక్ వినిపిస్తుంది. మణికంఠ వల్ల హౌస్ లో పెద్దగా ఎంటర్టైన్మెంట్ లేదు కాబట్టి టేస్టీ తేజ(Tasty Teja) ఉంటేఎంతో కొంత ఎంటర్‌టైన్‌మెంట్ వస్తుందనే ఉద్దేశంతో ఈ పనిచేశారా అనేది తెలియడంలేదు. కాని ఈ విషయం మాత్రం ఆడియన్స్ కు.. మరీ ముఖ్యంగా మణికంఠ ఫ్యాన్స్ కు పెద్ద షాక్ అనే చెప్పాలి. చూడాలి మరి ఈ రోజు రాత్రి నాగార్జున ఎలాంటి ట్విస్ట్‌లు ఇస్తారో..!