Bigg Boss8| బిగ్ బాస్ క్రేజీ అప్‌డేట్.. సీజన్ 8లో ఇన్ని సర్‌ప్రైజ్‌లు ఉంటాయా..!
Bigg Boss8| బుల్లితెర ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయం అక్కర్లేని షో బిగ్ బాస్. అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న ఈ షో తెలుగులో కూడా స

Bigg Boss8| బుల్లితెర ప్రేక్షకులకి ప్రత్యేక పరిచయం అక్కర్లేని షో బిగ్ బాస్. అన్ని ప్రాంతీయ భాషలలో సక్సెస్ ఫుల్‌గా సాగుతున్న ఈ షో తెలుగులో కూడా సక్సెస్ ఫుల్‌గా సాగుతుంది. గత సీజన్ మంచి టీఆర్పీ రాబట్టడంతో సీజన్ 8ని అంతకు మించి అనేలా రూపొందిస్తున్నారు. సరికొత్త గేమ్స్, టాస్క్స్ తో ఈ షోని రక్తికట్టించేలా ప్లాన్ చేస్తున్నట్టు తెలుస్తుంది. ఆగస్ట్‌లో ఈ షో ప్రారంభం కానుందని తెలుస్తుండగా,ఇప్పటికే కంటెస్టెంట్స్ ఎంపిక ప్రక్రియ కూడా పూర్తైందని అంటున్నారు. బర్రెలక్క, రీతూ చౌదరి, బంచిక్ బబ్లు, హేమ, సురేఖావాణి, బుల్లెట్ భాస్కర్, కిరాక్ ఆర్పీ, అమృత ప్రణయ్, కుమారీ ఆంటీతో పాటు పలువురు బుల్లితెర, వెండితెర, సోషల్ మీడియా సెలెబ్స్ సీజన్ 8లో పాల్గొనబోతున్నారని టాక్.
ఇక బిగ్ బాస్ లాంచింగ్ ఎపిసోడ్ కూడా భారీగానే ప్లాన్ చేస్తున్నారు. అయితే లాంచింగ్ ఎపిసోడ్‌ని ఒకసారి కాకుండా రెండు సార్లు జరిపేలా ప్లాన్ చేస్తున్నట్టు టాక్. ఫస్ట్ ఎపిసోడ్లో కొంత మంది కంటెస్టెంట్స్ మాత్రమే పరిచయం చేసి ఐదు వారాల తర్వాత మిగతా కంటెస్టెంట్స్ ని మినీ లాంచ్ ఈవెంట్ ద్వారా పరిచయం చేస్తారట. సీజన్ 7లో ఇదే ఫార్ములా అప్లై చేయగా, ఆ ప్రయోగం సక్సెస్ అయింది. దీంతో సీజన్ 8లో కూడా అదే ఫార్ములాని అప్లై చేయబోతున్నట్టు తెలుస్తుంది. సీజన్ 7లో మొదటిసారి 14 మంది కంటెస్టెంట్స్ ని పరిచయం చేశారు. ఐదు వారాల అనంతరం అంబటి అర్జున్, పూజ మూర్తి, నయని పావని, భోలే షావలి, అశ్విని శ్రీ లను హౌస్లోకి పంపారు.
రెండుసార్లు లాంచింగ్ ఎపిసోడ్ ప్రసారం చేయడం వలన టీఆర్పీ పరంగా ప్లస్ కావడంతో ఈ సారి కూడా అలానే చేయబోతున్నారట. ఇక సీజన్ 8లో నాగార్జునతో పాటు మరో హోస్ట్ కూడా ఉండబోతున్నట్టు తెలుస్తుంది. నాగార్జునతో నాని లేదా రానా హోస్ట్‌గా ఉంటారని అంటున్నారు. నాని, రానాలకి హోస్టింగ్ లో మంచి అనుభవం ఉంది కాబట్టి వారిద్దరిలో ఒకరు నాగార్జునతో కలిసి సీజన్ 8ని హోస్ట్ చేయనున్నారని అంటున్నారు. దీనిపై క్లారిటీ రావలసి ఉంది.