ఈడీ విచారణకు హాజరుకానున్న చార్మీ

విధాత:టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నటి చార్మీ నేడు(సెప్టెంబర్‌2)న ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కెల్విన్‌ ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈడీ అధికారులకు అప్రూవర్‌గా మారిపోయాడు. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు నటి ఛార్మీ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు పంపినట్టుగా సమాచారం. ఈ నేపథ్యంలో బ్యాంక్ ఖాతాల వివారాలను వెంట తేవాలని చార్మీకి ఈడీ ఆదేశాలు […]

ఈడీ విచారణకు హాజరుకానున్న చార్మీ

విధాత:టాలీవుడ్‌ డ్రగ్స్‌ కేసులో నటి చార్మీ నేడు(సెప్టెంబర్‌2)న ఈడీ విచారణకు హాజరు కానున్నారు. ఈ కేసులో నిందితుడుగా ఉన్న కెల్విన్‌ ఇప్పటికే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ డైరెక్టరేట్‌ (ఈడీ) అధికారుల ముందు లొంగిపోయిన విషయం తెలిసిందే. తాజాగా ఆయన ఈడీ అధికారులకు అప్రూవర్‌గా మారిపోయాడు. కెల్విన్ ఇచ్చిన సమాచారం ఆధారంగా ఈడీ అధికారులు నటి ఛార్మీ సహా పలువురు టాలీవుడ్ ప్రముఖులకు నోటీసులు పంపినట్టుగా సమాచారం.

ఈ నేపథ్యంలో బ్యాంక్ ఖాతాల వివారాలను వెంట తేవాలని చార్మీకి ఈడీ ఆదేశాలు జారీ చేసింది. ఇది వరకే పూరి జగన్నాథ్‌ తన బ్యాంకు ఖాతాల వివరాలను ఈడీ అధికారులు సమర్పించారు. హీరోయిన్‌గా గుడ్‌బై చెప్పిన చార్మీ ప్రస్తుతం దర్శకుడు పూరి జగన్నాథ్‌తో కలిసి కో ప్రొడ్యూసర్ గా సినిమాలు తెరకెక్కిస్తుంది. 2017లో మాదకద్రవ్యాలు సరఫరా చేస్తున్నారనే ఆరోపణలపై చార్మీ ఎక్సైజ్‌ విచారణను ఎదుర్కొన్న సంగతి తెలిసిందే.