Chikiri Chikiri Song From Peddi : ‘పెద్ది’నుంచి ‘చికిరి చికిరి..’ సాంగ్ వచ్చేసిందోచ్
గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ నటిస్తున్న 'పెద్ది' సినిమా నుంచి మొదటి సింగిల్ ‘చికిరి చికిరి..’ పాట విడుదలైంది. ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటలో రామ్ చరణ్, జాన్వీ కపూర్ నటించారు.
విధాత : గ్లోబల్ స్టార్ రామచరణ్ టైటిల్ రోల్ పోషిస్తున్న ‘పెద్ది’ సినిమా నుంచి మేకర్స్ కీలక అప్డేట్ వదిలారు. ఫస్ట్ సింగిల్ గా మూవీ నుంచి హీరోహీరోయిన్లు రామ్ చరణ్, జాన్వీకపూర్ లపై చిత్రీకరించిన ‘చికిరి చికిరి..’అంటూ సాగే పాటను విడుదల చేశారు. లెజండ్ ఏఆర్ రెహమాన్ సంగీతం అందించిన ఈ పాటను సింగర్ మోహిత్ చౌహాన్ మంచి ఈజ్ తో పాడారు. బాలాజీ అందించిన లిరిక్స్ ఆకట్టుకున్నాయి. హీరోయిన్ వెంట హీరోయిన్ పడే సన్నివేశాల మధ్య ఈ పాట సాగుతుంది. పాటలో ఆ చంద్రుడిలో ముక్క..జారిందే దీనక్క..నా ఒళ్ళంతా ఆడిందే తైతక్కా..ఓ చికిరి చికిరి..పడుతా పడుతా వెనుకే వెనుకే పడుతా..అంటూ పాట ఊపు మీద సాగింది. ఈ పాటలో రామ్ చరణ్ డాన్స్, నటన హైలట్ గా చెప్పుకోవచ్చు.
దర్శకుడు బుచ్చిబాబు సనా విలేజ్ పాలిటిక్స్, స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కిస్తున్న ఈ పాన్ ఇండియా సినిమాలో జాన్వీ కపూర్, శివ రాజ్‌కుమార్, దివ్యేందు శర్మ, జగపతిబాబు కీలక పాత్రలు పోషిస్తున్నారు. ఈ చిత్రం వచ్చే ఏడాది మార్చి 27న ప్రేక్షకుల ముందుకు రానుంది.
X
Google News
Facebook
Instagram
Youtube
Telegram