Hanuman|ఏంటి.. హ‌నుమాన్ సినిమాలోని ఆంజ‌నేయుడి విగ్ర‌హం వెన‌క చిరంజీవి హ‌స్తం ఉందా?

Hanuman| క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మొద‌టి నుండి కూడా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న నుండి తాజాగా వ‌చ్చిన చిత్రం హ‌నుమాన్. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగులోనే కాకుండా అన్ని

  • By: sn    cinema    May 04, 2024 9:49 AM IST
Hanuman|ఏంటి.. హ‌నుమాన్ సినిమాలోని ఆంజ‌నేయుడి విగ్ర‌హం వెన‌క చిరంజీవి హ‌స్తం ఉందా?

Hanuman| క్రియేటివ్ డైరెక్టర్ ప్రశాంత్ వర్మ మొద‌టి నుండి కూడా వైవిధ్య‌మైన సినిమాలు చేస్తూ ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తూ వ‌స్తున్న విష‌యం తెలిసిందే. ఆయ‌న నుండి తాజాగా వ‌చ్చిన చిత్రం హ‌నుమాన్. ఈ చిత్రం ఎంత పెద్ద హిట్ అయిందో ప్ర‌త్యేకంగా చెప్ప‌న‌క్క‌ర్లేదు. తెలుగులోనే కాకుండా అన్ని భాష‌ల‌లో ఈ సినిమాకి మంచి ఆద‌ర‌ణ ల‌భించింది.ఇందులో తేజ సజ్జా మెయిన్ హీరోగా నటించగా.. అమృత అయ్యర్ క‌థానాయిక‌గా క‌నిపించి అలరించింది. వరలక్ష్మీ శరత్ కుమార్ హీరోకు అక్కగా కీలక పాత్రలో మెప్పించింది. ప్ర‌స్తుతం ఈ మూవీ జీ5 ఓటీటీలో స్ట్రీమింగ్ అవడమే కాకుండా నిత్యం వార్త‌ల‌లో నిలుస్తుంది. ఇక ఈ సినిమాకి సీక్వెల్‌గా ‘జై హనుమాన్‌తో ప్రేక్షకులకు గ్లోబల్ ఎక్స్ పీరియన్స్ అందించబోతున్నారు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. ఈ సినిమా పోస్టర్‌ని రామ నవమి రోజున విడుదల చేసి అభిమానులకి మంచి వినోదాన్ని పంచారు.

అయితే ప్రశాంత్ వ‌ర్మ‌.. హ‌నుమాన్ సినిమాకి సంబంధించిన ఒక్కో సీక్రెట్ రివీల్ చేస్తూ ప్రేక్ష‌కుల‌కి మాంచి కిక్ ఇస్తున్నారు.తాజాగా హనుమాన్ లో ఆంజనేయుని భారీ విగ్రహం.. చిరంజీవి, మురుగదాస్ కాంబోలో తెరకెక్కిన స్టాలిన్ మూవీ పోస్టర్ రిఫరెన్స్ అని తెలియ‌జేశాడు ప్ర‌శాంత్. అంజనాద్రి కొండ‌పై వెలిసిన ఈ విగ్ర‌హం సినిమాకే హైలైట్ కాగా, దాని గురించి జోరుగా చర్చ‌లు న‌డుస్తున్న స‌మ‌యంలో ప్ర‌శాంత్ వ‌ర్మ అస‌లు విష‌యం చెప్పాడు. స్టాలిన్‌లోని ఈ పోస్ట‌ర్‌లో చిరంజీవిని చూడ‌గానే ఏదో తెలియ‌ని గూస్‌బంప్స్ వ‌స్తుంటాయి. అందుక‌నే ఆ పోస్ట‌ర్‌ని రిఫ‌రెన్స్ వాడుకొని విగ్ర‌హం చేయించాం. ఫైనల్ ఔట్ పుట్ కూడా అదిరిపోయేలా వ‌చ్చింద‌ని తెలియ‌జేశాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌.

అయితే ఈ వార్త విన్న మెగా ఫ్యాన్స్‌తో పాటు సినీ ప్రియులు కూడా ఆనందం వ్య‌క్తం చేస్తున్నారు. ఇక సీక్వెల్‌లో ఏకంగా చిరంజీవినే హ‌నుమాన్‌గా చూపించ‌బోతున్న‌ట్టుగా క‌థ‌నాలు వినిపిస్తుండ‌గా, ఇటీవ‌ల దానిపై ఇన్‌డైరెక్ట్‌గా క్లారిటీ ఇచ్చాడు ప్ర‌శాంత్ వ‌ర్మ‌. చూడాలి మ‌రి దీనిపై రానున్న రోజుల‌లో పూర్తి అప్‌డేట్ ఇస్తాడా అనేది.ఇక జై హనుమాన్ రిలీజ్ కావాలంటే మరో ఏడాదిన్నర ఆగక తప్పదని తెలుస్తోంది. బాలీవుడ్ నటులు ఈ సినిమాలో భాగం కానున్నట్టు వార్త‌లు వినిపిస్తున్నాయి.