Mega Star Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి, సురేఖ వెడ్డింగ్‌ ఇన్విటేషన్ చూశారా..? నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నది..!

Mega Star Chiranjeevi | మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో తెలుగు సినిమా (Telugu Movie) ఖ్యాతిని మరోమెట్టు ఎక్కించిన నటుడు ఆయన. చిరంజీవి అంటే గతంలో పాన్‌ ఇండియా స్థాయిలో చర్చించుకునేవారు.

Mega Star Chiranjeevi | మెగాస్టార్ చిరంజీవి, సురేఖ వెడ్డింగ్‌ ఇన్విటేషన్ చూశారా..? నెట్టింట తెగ చక్కర్లు కొడుతున్నది..!

Mega Star Chiranjeevi | మెగాస్టార్‌ చిరంజీవి (Mega Star Chiranjeevi) గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. తనదైన నటనతో తెలుగు సినిమా (Telugu Movie) ఖ్యాతిని మరోమెట్టు ఎక్కించిన నటుడు ఆయన. చిరంజీవి అంటే గతంలో పాన్‌ ఇండియా స్థాయిలో చర్చించుకునేవారు. సీనియర్‌ నటులు ఎన్టీఆర్‌, ఏఎన్‌ఆర్‌, కృష్ణ తర్వాత అందరూ ఎక్కువగా చెప్పుకునేది మెగాస్టార్‌ గురించే. దేశ చిత్ర పరిశ్రమలో తొలిసారిగా రూ.కోటి పారితోషకం తీసుకొని అందరికీ షాక్‌ ఇవ్వడం గమనార్హం. ప్రస్తుతం ఏడుపదుల వయసుకు వచ్చినా యువ హీరోలకు గట్టిపోటీ ఇస్తున్నారు. డ్యాన్స్‌, ఫైట్స్‌తో యావత్‌ సినీ అభిమానులను అలరిస్తున్నారు. ఇటీవల ఆయన డ్యాన్స్‌తో గిన్నిస్‌ బుక్‌ ఆఫ్‌ వరల్డ్‌ రికార్డుల్లోకి ఎక్కారు. వందల సంఖ్యలో పాటలకు తనదైన స్టయిల్‌లో డ్యాన్స్‌ చేస్తూ అభిమానులను అలరించాయి.

ఇదంతా ఇలా ఉండగా.. ఇటీవల సోషల్‌ మీడియాలో చిరంజీవి పెళ్లి ఆహ్వానపత్రిక సోషల్‌ మీడియాలో తెగ వెరల్‌ అవుతున్నది. ప్రముఖ టాలీవుడ్‌ దివంగత హాస్యనటుడు అల్లు రామలింగయ్య తనయ సురేఖను చిరంజీవి 1980 ఫిబ్రవరి 20న పెళ్లి చేసుకున్నారు. పెళ్లి ముహూర్తం సమయానికి వరుస సినిమాలతో ఫుల్‌ బిజీగా ఉన్నారు. కేవలం మూడురోజులు షూటింగ్‌కి బ్రేక్‌ తీసుకొని పెళ్లి చేసుకున్నారు. అప్పటి వెడ్డింగ్‌ కార్డ్‌ ప్రస్తుతం వైరల్‌ అవుతున్నది. ఆహ్వానపత్రికలో చిరంజీవి ఫొటోను ముద్రించారు. ప్రస్తుతం ఈ వెడ్డింగ్‌ ఇన్విటేషన్‌ను మెగా అభిమానులు సోషల్‌ మీడియాలో తెగ ట్రెండింగ్‌ చేస్తున్నారు. ప్రస్తుతం చిరంజీవి ‘విశ్వంభర’ మూవీలో నటిస్తున్నది. ఈ మూవీకి వశిష్ట మల్లిడి దర్శకత్వం వహిస్తున్నారు. దాదాపు రూ.200కోట్ల బడ్జెట్‌తో మేకర్స్‌ తెరకెక్కిస్తున్నారు. ఇందులో త్రిష హీరోయిన్‌గా నటిస్తున్నది. చిరంజీవి, త్రిష డబుల్‌ రోల్‌లో నటించనున్నారని టాక్‌. ఇక మీనాక్షి చౌదరి, ఆషికా రంగనాథ్‌, ఇషా చావ్లా, సురభి పురాణిక్‌ కీలకపాత్రల్లో కనిపించనున్నారు.