Sreemukhi| ఆ కమెడీయన్‌ని శ్రీముఖి నిండా ముంచేసిందా.. ఇప్పుడు పీకల్లోతు అప్పు..!
Sreemukhi| పటాస్ షోతో పాపులర్ అయి ఆ తర్వాత పలు ఆఫర్స్ దక్కించుకొని ఇప్పుడు స్టార్ యాంకర్‌గా తన హవా చూపిస్తుంది అందాల శ్రీముఖి.సరిగమప, కామెడీ స్టార్స్, సారంగదరియా, మిస్టర్ అండ్ మిసెస్, నీతోనే డాన్స్, ఆదివారం స్టార్ మాపరివార్, బిబీ జోడీ వంటి టాప్ షోస్‌కి యాంకరింగ్ చేసింది శ్రీ

Sreemukhi| పటాస్ షోతో పాపులర్ అయి ఆ తర్వాత పలు ఆఫర్స్ దక్కించుకొని ఇప్పుడు స్టార్ యాంకర్‌గా తన హవా చూపిస్తుంది అందాల శ్రీముఖి.సరిగమప, కామెడీ స్టార్స్, సారంగదరియా, మిస్టర్ అండ్ మిసెస్, నీతోనే డాన్స్, ఆదివారం స్టార్ మాపరివార్, బిబీ జోడీ వంటి టాప్ షోస్‌కి యాంకరింగ్ చేసింది శ్రీముఖి. ఇక బిగ్ బాస్ షోలో రన్నరప్‌గా నిలిచింది. బిగ్ బాస్ షోకి వెళ్లి వచ్చాకే శ్రీముఖి క్రేజ్ మరింత పెరిగింది. ఇప్పుడు ఆమె వెంట షోస్ క్యూ కడుతున్నాయి. డామినేటింగ్ యాటిట్యూడ్, చలాకీతనం, సెటైర్లని స్పోర్టీవ్‌గా తీసుకోవడం, పులిహోర కలపడం ఇలా రాములమ్మ తనదైన స్టైల్‌లో ప్రేక్షకులకి ఫుల్ ఎంటర్‌టైన్‌మెంట్ అందిస్తుంది. అయితే ఇప్పుడు శ్రీముఖికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతుంది.
యాంకర్ శ్రీముఖితో జబర్ధస్త్ కమెడీయన్ సినిమా చేయగా, ఆ సినిమాతో పీకల్లోతు కష్టాల్లో పడ్డాడట ఆ కమెడీయన్.మరి ఇంతకీ ఎవరా కమెడియన్ అంటుకున్నారా మరెవరో కాదు ధనరాజ్.జబర్థస్త్ లో టీమ్ లీడర్ గా.. మంచి మంచి స్కిట్లతో అదరగొట్టిన ధనరాజ్ మంచి మంచి సినిమా అవకాశాలు కూడా అందిపుచ్చుకున్నాడు.ఇక నటుడిగానే స్థిర పడిపోకుండా నిర్మాతగా, దర్శకుడుగా పలు అవతారాలు ఎత్తాడు. మల్టీ టాలెంటెడ్ ఆర్టిస్ట్ సముద్రఖనిని ఒప్పించి అతడితో ఓ సినిమా చేశాడు ధనరాజ్. ఈ ఏడాదిలోనే ఆ మూవీ ప్రేక్షకుల ముందుకు రానుంది. అయితే ధనరాజ్ యాంకర్ శ్రీముఖి హీరోయిన్ గా ధనలక్ష్మి తలుపు తడితే అనే సినిమాను నిర్మించాడు. ఆ సినిమా కోసం తన దగ్గర ఉన్నదంతా తీసి పెట్టాడు.
అప్పటికీ బడ్జెట్ సరిపోకపోతే తన స్నేహితుల దగ్గర అప్పు చేశాడట. అయితే సినిమా రిలీజ్ కావడం,మంచి టాక్ రావడం, వారం రోజుల వరకు బాగానే ఆడడం జరిగిందట. అయితే ఈ సినిమా రిలీజైన వారానికే బాహుబలి రావడంతో ధనరాజ్ నిర్మించిన మూవీని పట్టించుకునే వాళ్లు కరువయ్యారు. దాంతో కలెక్షన్స్ లేక చాలా నష్టాలు చవి చూడాల్సి వచ్చిందని ధనరాజ్ ఓ సందర్భంలో స్పష్టం చేశాడు. ఆ సినిమా దెబ్బకు చాలా కష్టాలు అనుభవించాడట. మళ్లీ పుంజుకోవడానికి చాలా సమయం పట్టిందని తెలియజేశాడు స్టార్ కమెడీయన్