Mahesh Babu|ఇదెక్కడి అభిమానం రా.. మహేష్ బాబు మూవీ థియేటర్‌లో పెళ్లి చేసుకున్న ఫ్యాన్
Mahesh Babu| స్టార్ హీరోల బర్త్‌డేని ఫ్యాన్స్ ఎంత గ్రాండ్‌గా జరుపుకుంటారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో సంబురాలు అంబరాన్నంటాయి. మరోవైపు మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన కెరీర్‌లోనే క్లాసిక్ మూవీ అయిన మురారి రీరిలీ

Mahesh Babu| స్టార్ హీరోల బర్త్‌డేని ఫ్యాన్స్ ఎంత గ్రాండ్‌గా జరుపుకుంటారో మనం చూస్తూనే ఉన్నాం. ఈ రోజు సూపర్ స్టార్ మహేష్ బాబు బర్త్ డే కావడంతో రెండు తెలుగు రాష్ట్రాలలో సంబురాలు అంబరాన్నంటాయి. మరోవైపు మహేష్ బాబు బర్త్ డే సందర్భంగా ఆయన కెరీర్‌లోనే క్లాసిక్ మూవీ అయిన మురారి రీరిలీజ్ జరిగింది. దీంతో థియేటర్స్‌లో సందడి వాతావరణం నెలకొంది. థియేటర్స్ ముందు తెగ రచ్చ చేస్తూ కేరింతలు కొడుతూ నానా హంగామా చేస్తున్నారు. అయితే కృష్ణ వంశీ దర్శకత్వం వహించిన మురారి సినిమా ఎంతో పెద్ద హిట్ అయ్యిందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పనిలేదు.
చిత్రంలో మహేష్ బాబు తన నటనతో ఎంతగానో ఆకట్టుకున్నాడు. ఇక కథానాయికగా నటించిన సోనాలి బింద్రే కూడా అదరగొట్టింది. ఇప్పుడు మురారి మూవీ రీ రిలీజ్ తో ఫ్యాన్స్ సందడి చేస్తున్నారు. కాగా మురారి థియేటర్ లో ఓ ఫ్యాన్ జంట పెళ్లి కూడా చేసుకోవడం చర్చనీయాంశంగా మారింది. ఇందుకు సంబంధించిన వీడియో వైరల్‌గా మారింది. ఇక కొన్ని థియేటర్స్‌లో మహిళా ఫ్యాన్స్ తీన్‌మార్ స్టెప్పులతో డ్యాన్స్‌లు వేస్తుండగా, ఆ వీడియోలు తెగ వైరల్ అవుతున్నాయి. ఇక ఈ సినిమా టైటిల్ కార్డ్స్ కూడా కొత్తగా ఉండటంతో ఫ్యాన్స్ తెగ ఎంజాయ్ చేశారు.
ఎంతోమంది చిన్న పిల్లలకి గుండె ఆపరేషన్లు చేయించిన మహేష్ ఇలాంటి పుట్టిన రోజులు ఎన్నో జరుపుకోవాలని అందరు కోరుకుటున్నారు. కాగా, మహేష్ బాబు-సోనాలి బింద్రే కాంబోలో దర్శకుడు కృష్ణవంశీ 2001లో మురారి చిత్రాన్ని తెరకెక్కించారు. ఫ్యామిలీ ఎమోషనల్ డ్రామాగా వచ్చిన ఈ సినిమాతోనే అతని క్రేజ్ అమాంతంగా పెరిగింది. చివరిగా మహేష్ గుంటూరు కారం చిత్రంతో ఆడియన్స్‌ను పలకరించారు. త్వరలోనే రాజమౌళితో చేయబోతున్న సినిమా షూటింగ్ మొదలుకానుంది. ప్రస్తుతం ఈ సినిమా ప్రీ ప్రొడక్షన్ పనులు జరుగుతుండగా, ఈ సినిమా కోసం ప్రేక్షకులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.