Kalyan Ram|క‌ళ్యాణ్ రామ్- విజ‌యశాంతి మూవీ సెట్‌లో అగ్ని ప్ర‌మాదం.. నిర్మాత‌కి 4 కోట్లు న‌ష్టం

Kalyan Ram| నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ ఒక‌వైపు నిర్మాత‌గా మంచి సినిమాలు తీస్తూనే మ‌రోవైపు హీరోగా వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. బింబిసార చిత్రంతో క‌ళ్యాణ్ రామ్ మంచి హిట్ కొట్టాడు. ఆ సినిమా త‌ర్వాత మ‌నోడు చేసిన సినిమాలు పెద్దగా విజ‌యం సాధించ‌లేక‌పోయాయి. చివ‌రిగా

  • By: sn    cinema    May 10, 2024 7:33 AM IST
Kalyan Ram|క‌ళ్యాణ్ రామ్- విజ‌యశాంతి మూవీ సెట్‌లో అగ్ని ప్ర‌మాదం.. నిర్మాత‌కి 4 కోట్లు న‌ష్టం

Kalyan Ram| నంద‌మూరి హీరో క‌ళ్యాణ్ రామ్ ఒక‌వైపు నిర్మాత‌గా మంచి సినిమాలు తీస్తూనే మ‌రోవైపు హీరోగా వైవిధ్య‌మైన సినిమాల‌తో ప్రేక్ష‌కుల‌ని అల‌రిస్తున్నాడు. బింబిసార చిత్రంతో క‌ళ్యాణ్ రామ్ మంచి హిట్ కొట్టాడు. ఆ సినిమా త‌ర్వాత మ‌నోడు చేసిన సినిమాలు పెద్దగా విజ‌యం సాధించ‌లేక‌పోయాయి. చివ‌రిగా డెవిల్ అనే చిత్రంతో ప్రేక్ష‌కుల ముందుకు వ‌చ్చాడు. ఈ చిత్రం బాక్సాఫీస్ వ‌ద్ద డిజాస్ట‌ర్‌గా మిగిలింది. ఇక ఇప్పుడు భారీ బ‌డ్జెట్ చిత్రం చేస్తుండ‌గా, ఈ మూవీతో పెద్ద హిట్ కొట్టాల‌ని అనుకుంటున్నాడు. ప్రదీప్ చిలుకూరి దర్శకత్వంలో ఈ చిత్రం తెరకెక్కిస్తుండా, ఇందులో లేడి సూప‌ర్ స్టార్ విజ‌య శాంతి కీల‌క పాత్ర పోషిస్తుంద‌ని స‌మాచారం.

ఇటీవ‌లి కాలంలో విజ‌య‌శాంతి ఆచితూచి మాత్ర‌మే సినిమాలు చేస్తుంది. స‌రిలేరు నీకెవ్వ‌రు చిత్రంతో రీఎంట్రీ ఇచ్చిన విజ‌యశాంతి మ‌ళ్లీ సినిమా చేయ‌లేదు. ఇప్పుడు క‌ళ్యాణ్ రామ్ సినిమా చేస్తుంద‌ని అంటున్నారు. ఈ చిత్రంలో విజ‌య‌శాంతి పాత్ర క‌ర్త‌వ్యం మూవీలోని త‌న పాత్ర మాదిరిగా ఉంటుంద‌ని, అందుకే ఆమె గ్రీన్ సిగ్న‌ల్ ఇచ్చింద‌ని టాక్. అయితే ఈ మూవీ కోసం సీబీఐ ఆఫీస్ సెట్ నిర్మించార‌ట‌. ఇందులో పది రోజుల పాటు షూటింగ్ జ‌ర‌పాలని మేక‌ర్స్ భావించారు. కొంత షూటింగ్ పూర్తి కాగా, మ‌రి కొంత పెండింగ్ ఉంద‌ట‌. అయితే ఈ లోపే సెట్‌లో భారీ అగ్ని ప్ర‌మాదంచోటు చేసుకున్న‌ట్టు స‌మాచారం.

ఇటీవల చిత్ర యూనిట్ షూటింగ్ పూర్తి చేసుకుని వెళ్లిపోగా, రాత్రి 8గంట‌ల ప్రాంతంలో షార్ట్ స‌ర్క్యూట్ వ‌ల‌న అగ్ని ప్ర‌మాదం జ‌రిగిన‌ట్టు టాక్. అయితే అగ్ని ప్రమాదాన్ని గుర్తించి అగ్ని మాప‌క సిబ్బందికి స‌మాచారం అందించే లోపు సెట్ అంతా కాలి బూడిద అయిపోయింద‌ట‌. సెట్ పూర్తిగా కాలి పోవ‌డం నిర్మాత‌కి దాదాపు నాలుగు కోట్ల వర‌కు న‌ష్టం వాటిల్లి ఉంటుంద‌ని అంచ‌నా వేస్తున్నారు. మ‌రి ఈ ఘ‌ట‌న‌కి సంబంధించి పూర్తి వివ‌రాలు అయితే బ‌య‌ట‌కు రావ‌ల్సి ఉంది.