Hema| హేమ హైడ్రామా.. పోలీసుల విచార‌ణ‌కి డుమ్మా కొట్టేసిందా?

Hema|  తెలుగు సినీ నటి హేమ ఇప్పుడు వార్త‌ల‌లో హాట్ టాపిక్‌గా మారింది. బెంగుళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీకి వెళ్లి, తరువాత తాను వెళ్లలేదని బుకాయిస్తూ అదే ఫార్మ్ హౌస్ నుండి వీడియో విడుద‌ల చేసింది. ఆ త‌ర్వాత ఇంట్లో బిరియాని వండుతున్న‌ట్టుగా వీడియో రిలీజ్ చేసింది. హేమ రేవ్ పార్టీకి హాజ‌రైంద‌ని పోలీసులు చెబుతున్నా కూడా హైడ్రామా ఆడుతూనే ఉంది. రేవ్ పార్టీలో దొరికిన వారిలో డ్రగ్ తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిన 86 మందికి బెంగ

  • By: sn    cinema    May 27, 2024 3:17 PM IST
Hema| హేమ హైడ్రామా.. పోలీసుల విచార‌ణ‌కి డుమ్మా కొట్టేసిందా?

Hema|  తెలుగు సినీ నటి హేమ ఇప్పుడు వార్త‌ల‌లో హాట్ టాపిక్‌గా మారింది. బెంగుళూరులో జరిగిన ఒక రేవ్ పార్టీకి వెళ్లి, తరువాత తాను వెళ్లలేదని బుకాయిస్తూ అదే ఫార్మ్ హౌస్ నుండి వీడియో విడుద‌ల చేసింది. ఆ త‌ర్వాత ఇంట్లో బిరియాని వండుతున్న‌ట్టుగా వీడియో రిలీజ్ చేసింది. హేమ రేవ్ పార్టీకి హాజ‌రైంద‌ని పోలీసులు చెబుతున్నా కూడా హైడ్రామా ఆడుతూనే ఉంది. రేవ్ పార్టీలో దొరికిన వారిలో డ్రగ్ తీసుకున్నట్లు ప్రాథమికంగా నిర్ధారణ అయిన 86 మందికి బెంగళూరు సీసీబీ పోలీసులు నోటీసులు జారీ చేసిన విషయం తెలిసిందే. సోమవారం (మే 27) రోజు బెంగళూరులోని సీసీబీ కార్యాలయంలో విచారణకు రావాలంటూ నోటీసులు రాగా, హేమ‌కి కూడా నోటీసులు అందాయి. అయితే ఆమె విచార‌ణ‌కి డుమ్మా కొట్టింది.

తాను ప్ర‌స్తుతం వైర‌ల్ ఫీవ‌ర్‌తో బాధ‌ప‌డుతున్న‌ట్టు లేఖ‌లో తెలియ‌జేస్తూ , విచార‌ణ‌కి హాజ‌రు కాలేన‌ని పేర్కొంది. విచార‌ణ‌కి హాజ‌రు కావ‌డానికి త‌న‌కు కొంత స‌మ‌యం కావాలంటూ పోలీసుల‌ని అభ్య‌ర్ధించింది. అయితే హేమ అభ్యర్థనను సీసీబీ తిరస్కరించినట్లు తెలుస్తోంది. విచారణకు రమ్మంటూ పోలీసులు మరోసారి ఆమెకు నోటీసులు పంపనున్నట్లు తెలుస్తుంది. మ‌రోవైపు హేమ ఏపీలోని పలువురు రాజకీయ నాయకుల నుంచి మద్దతు కోరినట్లు తెలుస్తోంది. కర్ణాటక పోలీసులు నోటీసులు జారీ చేయడంపై ఆంధ్రప్రదేశ్ రాజకీయ నాయకులు సీసీబీకు పదే పదే ఫోన్ చేస్తున్నట్లు ఓ వార్త నెట్టింట వైర‌ల్ అవుతుంది. హేమ‌ని అరెస్ట్ చేయ‌వ‌ద్దని ఒత్తిడి చేస్తున్నట్టు టాక్ వినిపిస్తుంది.

ఇక ఇదిలా ఉంటే హేమ‌పై క‌రాటే కళ్యాణి తీవ్ర వ్యాఖ్యలు చేస్తూ విరుచుకుపడ‌డం మ‌నం చూశాం. హేమ దగ్గర కొంతమంది అమ్మాయిలు ఉంటారని వాళ్ల ఫోటోలను హేమ గ్రూపులలో షేర్ చేస్తూ ఉంటుందని, దానికి నేనే సాక్ష్యమని చెప్పారు. గతంలో జరిగిన ఒక విషయాన్ని వెల్లడించిన కరాటే కళ్యాణి.. జబర్దస్త్ వర్ష ఫోటోలను ఒకసారి హేమ గ్రూప్ లో పెట్టిందని, ఎందుకు ఈ ఫోటో గ్రూపులో పెట్టింది అని చాలామంది అడుగుతుంటే వెంటనే డిలీట్ చేసిందని, ఎవరో అడిగితే ఎవరికో పంపబోయి గ్రూప్ లో పెట్టాను అని చెప్పిందని కరాటే కళ్యాణి పేర్కొంది. సినిమాలో క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా పని చేస్తేనే హేమ అంతగా డబ్బు సంపాదించలేదని, హేమ సినిమాలలో నటిస్తున్న పేరుతో చేయకూడనివి అన్ని చేస్తుందని త‌ప్పుల మీద త‌ప్పులు చేస్తుంద‌ని వాపొయింది.