ప్రస్తుతం టాలీవుడ్ టాప్ హీరోలలో ఎన్టీఆర్ ఒకరు. ఆయనకు ఆర్ఆర్ఆర్ సినిమాతో దేశ వ్యాప్తంగా క్రేజ్ వచ్చింది. ఇప్పుడు కొరటాల శివ దర్శకత్వంలో దేవర అనే సినిమా చేస్తున్నాడు. ఈ మూవీపై కూడా అంచనాలు ఓ రేంజ్లో ఉన్నాయి. అయితే ఎన్టీఆర్‌కి కార్లపైన ఎంత ఆసక్తి ఉందో ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. స్పోర్ట్స్ కార్లని ఆయన ఎంతో ఇష్టపడతారు. ఆ మధ్య లాంబోర్గిని ఉరుస్ అనే కారుని ఆయన కొనుగోలు చేశారు. ఇటలీ నుంచి ఈ కారును దిగుమతి చేయిస్తున్నారని సమాచారం. ఈ సూపర్ స్పోర్ట్స్ కారు ఖరీదు 5 కోట్ల వరకు ఉంటుంది. ఇప్పటికే తన గ్యారేజ్‌లో చాలా చాలా డిఫరెంట్ వెరైటీ కార్లు ఉన్నా రీసెంట్గా ఎన్టీఆర్ మరో కొత్త కారు కొన్నారు. రిజిస్ట్రేషన్ కోసం ఖైరతాబాద్ ఆఫీసులో ఎన్టీఆర్ ఇటీవల మెరవడం మనం చూశాం.
ఆఫీసు నుండి బయటకు వస్తున్న ఫొటోలు నెట్టింట తెగ హల్చల్ చేశాయి. కొత్త కారు రిజిస్ట్రేషన్ కోసం అక్కడికి వెళ్లినట్టు తెలుస్తుండగా, ఆయన ఏ కారు కొన్నారు, దాని ధర ఎంత అనే దానిపై ఇప్పుడు హాట్ హాట్ డిస్కషన్ నడుస్తుంది. ఈ క్రమంలో ఎన్టీఆర్ మెస్సిడేస్ బెంజ్ మే బాచ్ ఎస్ క్లాసిక్ యస్ 580 కారుని కొనుగోలు చేసినట్టు తెలుస్తుంది. ఈ లగ్జరీ ప్రీమియం కారును ఎన్టీఆర్ ఎంతో ఇష్టంగా కొనుక్కోగా, దీని ధర మూడు కోట్లకి పైగా ఉంటుందట. అడ్వాన్స్డ్ లగ్జరీ ఫీచర్స్ తో ఈ కారు తయారు కాగా, ఈ కారు ఎమర్జెన్సీ సమయంలో ఆటోమేటిక్‌గా అలారం కూడా మోగుతుందట . దీంతో పాటు ఎన్నో ఫీచర్స్ ఈ కారులో ఉన్నాయని అంటున్నారు.
ఇక ఎన్టీఆర్ సినిమాల విషయానికి వస్తే ఆయన కొరటాల డైరెక్షన్లో దేవర అనే సినిమా షూటింగ్ శరవేగంగా చేస్తున్నారు. ఆయన చేస్తున్న ఈసినిమాలో జాన్వీ కపూర్ హీరోయిన్ గా నటిస్తోంది. ఈమూవీ తరువాత ఆయన ప్రశాంత్ నీల్ సినిమాలో జాయిన్ అయ్యే అవకాశం ఉంది. ఈ సినిమా మాస్ లెవల్లో ఉంటుందని సమాచారం. ప్రస్తుతం సినిమాలు చేస్తూనే కొత్త కథలు కూడా ఎన్టీఆర్ వింటున్నట్టు తెలుస్తుంది. రానున్న రోజులలో ప్రేక్షకులకి మంచి ఫీస్ట్ అందించేలా ఎన్టీఆర్ కొత్త కథలని ఎంచుకుంటున్నట్టు తెలుస్తుంది.