Jr. NTR | హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయం రెండు వారాల విశ్రాంతి
రో జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయమైంది. జిమ్ చేస్తుండగా ఆయర ఎడమ చేయికి గాయమైందని రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని సమాచారం.

విధాత, హైదరాబాద్ : హీరో జూనియర్ ఎన్టీఆర్ చేతికి గాయమైంది. జిమ్ చేస్తుండగా ఆయర ఎడమ చేయికి గాయమైందని రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలని వైద్యులు సూచించారని సమాచారం. కాగా తనకు యాక్సిడెంట్‌లో గాయమైందన్న వదంతులను నమ్మవద్ధని జూనియర్ ఎన్టీఆర్ అభిమానులకు సూచించారు. జిమ్ చేస్తుండగా తగిలిన తన గాయం చిన్నదేనని, దీనిపై వదంతులు నమ్మవద్దని కోరారు. జూనియర్ ఎన్టీఆర్ ఇప్పటికే దేవర షూటింగ్ పూర్తి చేసుకున్నారు. అటు బాలివుడ్‌లో నిర్మిస్తున్న వార్ చిత్రంతో పాటు ప్రశాంత్ నీల్ చిత్రంలోనూ ఎన్టీఆర్ నటిస్తున్నారు. ఎన్టీఆర్, జాన్వీకపూర్ నటించిన దేవర చిత్రం షూటింగ్ పూర్తవ్వగా, ఈ సినిమా పాటలు హిట్ టాక్ తెచ్చుకున్నాయి.