Actress Anjali | తెలుగు బ్యూటీ అంజలి ఇటీవల ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల విడుదలైన ఈ సినిమా పాటివిట్ రెస్పాన్స్ వస్తున్నది. ఈ క్రమంలోనే ప్రముఖ కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అలీతో సరదాగా’ సీజన్-2 షోలో అంజలి పాల్గొంది. గతంలో వచ్చిన ‘గీతాంజలి’ మూవీని ఎంతగా ఎంజాయ్ చేస్తూ చేశానో.. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాను సైతం అంతే ఎంజాయ్ చేస్తూ చేశానని చెప్పింది.
Actress Anjali | తెలుగు బ్యూటీ అంజలి ఇటీవల ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీతో ప్రేక్షకుల ముందుకు వచ్చింది. ఇటీవల విడుదలైన ఈ సినిమాకు పాటివిట్ రెస్పాన్స్ వస్తున్నది. ఈ క్రమంలోనే ప్రముఖ కమెడియన్ అలీ వ్యాఖ్యాతగా వ్యవహరిస్తున్న ‘అలీతో సరదాగా’ సీజన్-2 షోలో అంజలి పాల్గొంది. గతంలో వచ్చిన ‘గీతాంజలి’ మూవీని ఎంతగా ఎంజాయ్ చేస్తూ చేశానో.. ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ సినిమాను సైతం అంతే ఎంజాయ్ చేస్తూ చేశానని చెప్పింది. కథ తనకు బాగా నచ్చిందని.. స్టోరీని ‘నిశ్శబ్దం’ సినిమా సమయంలో వినిపించినట్లుగా తెలిపింది. అది వర్కౌట్ అయ్యేందుకు ఇంత సమయం పట్టిందని చెప్పుకొచ్చింది. కెరీర్‌ను ప్రారంభించి 18 సంవత్సరాలవుతోందని.. ‘గీతాంజలి’ నేను చేసిన ఫస్ట్ లేడీ ఓరియెంటెడ్ సినిమా అని.. తనకు ఈ మూవీ మంచి పేరుతెచ్చిపెట్టిందని తెలిపింది.
అదే సినిమా పదేళ్లకు సీక్వెల్ చేశానని.. ఈ పదేళ్లలో చాలా విషయాలు నేర్చుకున్నానని చెప్పింది. తరుచూ పెళ్లిపై వస్తున్న రూమర్స్ సైతం అంజలి స్పందించింది. పెళ్లికి సంబంధించిన రూమర్స్ తరుచూ వస్తున్నాయని.. ఇప్పటికే నాకు ఐదారు పెళ్లిళ్లు చేశారని వాపోయింది. ఒకోసారి బిజినెస్మెన్.. మరోసారి సీనియర్ నిర్మాత అంటారని.. ఇలా ఏడాదికొకరితో నా పెళ్లి చేస్తున్నారని పేర్కొంది. ప్రతి సినిమా విడుదలకి ముందు ఇలాంటి ప్రచారం జరుగడం తాను గమనించానని అంజలి పేర్కొంది. అయితే, గతంలోనూ అంజలి పెళ్లి వార్తలపై స్పందించిన విషయం తెలిసిందే. తాను ఎక్కువగా అవుడోర్ షూటింగ్స్‌లో ఉంటున్నానని.. ఈ వార్తలతోనూ ఎలాంటి సంబంధం లేదని చెప్పింది. పెళ్లి తప్పకుండా చేసుకుంటానని.. కొంచెం సమయం పడుతుందని పేర్కొంది.
పెళ్లి ఫిక్స్ అయితే తానే ఈ విషయాన్ని చెబుతానని స్పష్టం చేసిన విషయం తెలిసిందే. అంజలి ఏపీలోని రాజోలుకు చెందిన అమ్మాయి అయినా.. కోలీవుడ్‌లో స్టార్ హీరోయిన్గా ఎదిగింది. తెలుగులోనూ విక్టరీ వెంకటేశ్, బాలకృష్ణవంటి స్టార్స్‌తో నటించింది. అయితే, కెరీర్ పీక్ టైం లో కుటుంబ గొడవలతో కొన్నాళ్లు సినిమాలకు దూరమైంది. తమిళ హీరో జైతో ప్రేమాయణం సాగించిందని.. ఇద్దరు కలిసి సహజీవనం చేసినట్లు ప్రచారం జరిగింది. ఇద్దరూ పెళ్లి చేసుకుంటారని వార్తలు వచ్చినా.. ఇద్దరూ విడిపోయారు. ఇక ప్రస్తుతం అంజలి వరుస సినిమాలతో కెరీర్లో ఫుల్ బిజీగా మారింది. ఈ ప్రస్తుతం అంజలి తెలుగులో రెండు సినిమాల్లో నటిస్తున్నది. రాంచరణ్‌కు జోడీగా ‘గేమ్ ఛేంజర్’తో పాటు గ్యాంగ్స్ ఆఫ్ గోదావరి మూవీలోనూ నటిస్తున్నది.