Anil Ravipudi| టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా తీయని డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. అనీల్ రావిపూడి డైరెక్టర్‌గానే కాదు ఆయనలో మల్టీ టాలెంటెడ్‌గా కూడా ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతుంటారు. పలు సందర్భాలలో డ్యాన్స్ లు చేయడం, స్కిట్స్ వేయడం వంటివి చేస్తూ అలరిస్తుంటాడు. అయితే అనీల్ రావిపూడి ఇటీవల స
Anil Ravipudi| టాలీవుడ్ సక్సెస్ ఫుల్ డైరెక్టర్ అనీల్ రావిపూడి గురించి ప్రత్యేకంగా చెప్పనక్కర్లేదు. రాజమౌళి తర్వాత ఇప్పటి వరకు ఒక్క ఫ్లాప్ కూడా తీయని డైరెక్టర్‌గా మంచి పేరు తెచ్చుకున్నారు. అనీల్ రావిపూడి డైరెక్టర్‌గానే కాదు ఆయనలో మల్టీ టాలెంటెడ్‌గా కూడా ప్రేక్షకుల మనసులు కొల్లగొడుతుంటారు. పలు సందర్భాలలో డ్యాన్స్ లు చేయడం, స్కిట్స్ వేయడం వంటివి చేస్తూ అలరిస్తుంటాడు. అయితే అనీల్ రావిపూడి ఇటీవల సత్యదేవ్ నటించిన కృష్ణమ్మ మూవీ ప్రీ రిలీజ్ ఈవెంట్ లో ఐపీఎల్ పై కొన్ని కామెంట్స్ చేయగా, అవి పెద్ద రచ్చగా మారాయి. ఐపీఎల్ చూడకపోతే కొంపలేమి మునిగిపోవు. సాయంత్రం వచ్చి థియేటర్స్ లో సినిమా చూడండి. ఫోన్ లో స్కోర్ చూసుకుంటే సరిపోతుంది అని అనడంతో ఈ డైరెక్టర్ని కొందరు ఓ రేంజ్లో ఆడేసుకున్నారు.
సినిమాలు చూడకపోయిన కొంపలు మునిగిపోవు అంటూ తెగ ట్రోలింగ్ చేయగా, దానిపై ఆ తర్వాత ఓ సందర్భంలో అనీల్ రావిపూడి వివరణ ఇచ్చారు. నేను ఐపీఎల్ చూస్తాను. నా మాటలని మీరు తప్పుగా అర్ధం చేసుకున్నారని క్లారిటీ ఇవ్వడంతో వివాదం సద్దుమణిగింది. ఇక తాజాగా అనిల్ రావిపూడి ఢీ షో గ్రాండ్ ఫినాలేకి అతిథిగా హాజరు కాగా, షోలో తెగ సందడి చేశాడు. ఇందుకు సంబంధించిన ప్రోమో విడుదలైంది. ఇందులో హైపర్ ఆది, అనీల్ రావిపూడి మధ్య మచ్చట్టు తెగ నవ్వు తెప్పించాయి. ముందుగా అనీల్ రావిపూడి హీరో మాదిరిగా ఎంట్రీ ఇవ్వగా, హైపర్ ఆది మాట్లాడుతూ.. ఏంటి అన్న రెండు సింహాల మధ్యలోనుంచి ఎంట్రీ ఇచ్చారు ? ఆ సింహానికి తెలిస్తే ఏమవుతుందో తెలుసా అంటూ బాలయ్యని ఉద్దేశిస్తూ సెటైర్ వేస్తాడు.
దానికి సమాధానం ఫుల్ ఎపిసోడ్‌తో తెలుస్తుంది. ఇక విన్నర్ ని అనౌన్స్ చేసే సమయంలో హైపర్ ఆది అనిల్ రావిపూడిని కాస్త చిరాకు పెట్టారు. అన్నా ఒక్కసారి మియావ్ మియావ్ పిల్లి డైలాగ్ చెప్పారా అని అడిగాడు. దాంతో అనీల్..మైక్ మడత పెట్టి.. అనాలని ఉంది అంటూ ఫన్నీగా ఆదికి వార్నింగ్ ఇచ్చాడు. ఇక ఐపీఎల్ చూడకపోతే కొంపలు మునగవు అంటూ అనిల్ రావిపూడి మాటలు ఆది అనడంతో వెంటనే అనీల్.. అహే ఆపు.. అని చిరాకు పడ్డారు. అంటే మిమ్మల్ని కవర్ చేయడానికే చెబుతున్నా అని హైపర్ ఆది అంటే.. అవసరం లేదు నేను ఆల్రెడీ కవర్ చేసుకున్నా. బ్యాటింగ్ మామూలుగా లేదక్కడ. క్రికెట్ ఫ్యాన్స్ జోలికి వెళ్లకండయ్యా.. చాలా సెన్సిటివ్ గా ఉన్నారు అంటూ అనిల్ రావిపూడి సరదాగా మాట్లాడుతూ నవ్వులు పూయించారు. ఫుల్ ఎపిసోడ్ మే 29న టెలికాస్ట్ కానుంది..