ACB Raids In Telangana | ఏసీబీకి చిక్కిన మరో ముగ్గురు ఉద్యోగులు

సిరిసిల్ల తహశీల్దార్ ఆఫీస్‌లో మండల సర్వేయర్ వేణుగోపాల్, ప్రైవేట్ సహాయకుడు వంశీ ₹20 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి పట్టుబడ్డారు. నాగర్‌కర్నూల్ జిల్లాలో లైన్‌మెన్ నాగేంద్ర ₹15 వేలు లంచం తీసుకుంటూ దొరికాడు.

ACB Raids In Telangana | ఏసీబీకి చిక్కిన మరో ముగ్గురు ఉద్యోగులు

విధాత: రాజన్న సిరిసిల్ల జిల్లా, సిరిసిల్ల మండలం తహశీల్దార్ కార్యాలయంలో మండల సర్వేయర్‌గా పనిచేస్తున్న మాడిశెట్టి వేణుగోపాల్, అతని ప్రైవేట్ సహాయకుడు సూర వంశీలు లంచం సొమ్ముతో ఏసీబీకి పట్టుబడ్డారు. ఫిర్యాదుదారుని తల్లికి సంబంధించిన భూమిని సర్వే చేయడానికి, పంచనామా ప్రతిని అందించడానికి ఫిర్యాదుధారుని నుండి రూ.30వేలు లంచం డిమాండ్ చేసి, ఇప్పటికే రూ.10వేలు తీసుకున్నారు. మిగిలిన రూ.20వేలు లంచం తీసుకుంటూ ఏసీబీ వలకు చిక్చారు.

నాగర్‌కర్నూల్‌ జిల్లాలో వంగూర్‌ మండలం మాచినోనిపల్లి గ్రామం టీజీఎస్‌పీడీసీఎల్‌కు చెందిన లైన్‌మెన్‌ తోట నాగేంద్ర రూ.15 వేలు లంచం తీసుకుంటూ ఏసీబీకి దొరికిపోయాడు. అవినీతికి పాల్పడ్డ లైన్‌మెన్‌పై కేసు నమోదు చేసి నాంపల్లి ఏసీబీ కోర్టులో ప్రవేశపెట్టామని అధికారులు వివరించారు.