Kalvakuntla Kavitha Yatra | తెలంగాణ యాత్రకు కవిత సన్నద్ధం

బీఆర్‌ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ కవిత 'సామాజిక తెలంగాణ సాధన' పేరుతో అక్టోబరు చివరి వారం నుంచి తెలంగాణ యాత్రకు సన్నద్ధమయ్యారు. ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో పోస్టర్లు ముద్రించినట్లు సమాచారం.

Kalvakuntla Kavitha Yatra | తెలంగాణ యాత్రకు కవిత సన్నద్ధం

విధాత: తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు, బీఆర్ఎస్ బహిష్కృత ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత తెలంగాణ యాత్రకకు సన్నద్దమయ్యారు. సామాజిక తెలంగాణ సాధన పేరుతో అక్టోబర్ చివరి వారంలో యాత్ర ప్రారంభించేందుకు కవిత నిర్ణయించుకున్నట్లుగా సమాచారం. తెలంగాణ అన్ని జిల్లాల మీదుగా ఫిబ్రవరి వరకు కవిత యాత్ర కొనసాగనుంది. అయితే కవిత యాత్ర కేసీఆర్ ఫోటో లేకుండా ప్రొఫెసర్ జయశంకర్ ఫోటోతో యాత్ర పోస్టర్లు ముద్రించినట్లుగా తెలుస్తుంది. ఇప్పటికే మేధావులు, విద్యావంతులతో తన యాత్ర నిర్వహణపై ఆమె చర్చించి కార్యాచరణ ఖరారు చేసుకున్నారు. రేపు బుధవారం యాత్ర పోస్టర్లను కవిత ఆవిష్కరించబోతున్నారు.

జాగృతి యూత్ ఫెడరేషన్ లకు నియమకాలు

తెలంగాణ జాగృతి యూత్ ఫెడరేషన్ రాష్ట్ర, జిల్లాల నాయకులకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కల్వకుంట్ల కవిత మంగళవారం నియామక పత్రాలు అందజేశారు. ఈ సందర్భంగా కవిత మాట్లాడుతూ.. సమాజంలో మార్పు అనేది యువత ద్వారానే సాధ్యమవుతుంది అన్నారు. తెలంగాణ ఉద్యమంలో గానీ స్వాతంత్ర ఉద్యమంలో గానీ యువతదే కీలక పాత్ర అని గుర్తు చేశారు. తెలంగాణలో ఒక మంచి సమాజాన్ని నెలకొల్పేందుకు మేము ప్రయత్నిస్తున్నాం అన్నారు. అందులో యువతది కీలక పాత్ర ఉండాలని నేను భావిస్తున్నానని తెలిపారు. కొత్తగా బాధ్యతలు చేపట్టనున్న వారు మంచి పేరు తెచ్చుకునేలా పనిచేయాలని కోరారు.

కవితను అడ్డుకున్న పోలీసులు

గ్రూప్ – 1 అభ్యర్థుల సమస్యలను తెలుసుకునేందుకు చిక్కడపల్లి సెంట్రల్ లైబ్రరీలోకి వెళ్లేందుకు తెలంగాణ జాగృతి అధ్యక్షురాలు కవిత చేసిన ప్రయత్నాలను పోలీసులు అడ్డుకున్నారు. కవితతో పాటు జాగృతి నాయకులను అడ్డుకున్నారు. దీంతో కవిత పోలీసులతో వాగ్వివాదానికి దిగి నిరసన వ్యక్తం చేశారు. గ్రూప్ 1 అభ్యర్థులను కలిస్తే కాంగ్రెస్ ప్రభుత్వానికి ఎందుకు అంత భయం అంటూ ప్రశ్నించారు.