Indian 2| సినిమాలో ఉన్న ఈ ఐదు ప్ర‌త్యేక‌త‌ల కోస‌మ‌న్నా ఇండియ‌న్ 2 చూడాల్సిందే..!

Indian 2| లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ క్రేజీ ప్రాజెక్ట్ భార‌తీయుడు 2 జూలై 12న థియేటర్స్‌లోకి రానుంది. ఈ క్ర‌మంలో సినిమాకి సంబంధించిన ప్ర‌మోషన్స్ భారీ ఎత్తునే సాగుతున్నాయి.మ‌రోవైపు ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ ధరల

  • By: sn    cinema    Jul 11, 2024 4:18 PM IST
Indian 2| సినిమాలో ఉన్న ఈ ఐదు ప్ర‌త్యేక‌త‌ల కోస‌మ‌న్నా ఇండియ‌న్ 2 చూడాల్సిందే..!

Indian 2| లోక‌నాయ‌కుడు క‌మ‌ల్ హాస‌న్ క్రేజీ ప్రాజెక్ట్ భార‌తీయుడు 2 జూలై 12న థియేటర్స్‌లోకి రానుంది. ఈ క్ర‌మంలో సినిమాకి సంబంధించిన ప్ర‌మోషన్స్ భారీ ఎత్తునే సాగుతున్నాయి.మ‌రోవైపు ఈ సినిమా టికెట్ ధరలను పెంచుకునేందుకు తెలంగాణ ప్రభుత్వం అనుమతి ఇచ్చింది. టికెట్ ధరల పెంపు సినిమా విడుదల అయ్యే జూలై 12 నుంచి 19వ తేదీ వరకు వర్తించనుంది.సింగిల్ స్క్రీన్ థియేటర్లలో రూ.50 మేర పెరగనున్నాయి. మల్టీప్లెక్స్‌ల్లో అయితే, అదనంగా రూ.75 పెంచుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం వీలు కల్పించింది. కాక‌పోతే ఓ ష‌ర‌తు విధించింది. ప్రతి థియేటర్‌లో సినిమా ప్రారంభం అయ్యే ముందు డ్రగ్స్, సైబర్ క్రైమ్‌పై ప్రేక్షకులకు అవగాహన కల్పించేలా యాడ్స్ ప్రదర్శించాలని కండీషన్ పెట్టింది.

భార‌తీయుడు సినిమా సంచ‌ల‌న విజ‌యం సాధించ‌డం,ఈ సినిమా రిలీజైన 28 ఏళ్ల‌కి భార‌తీయుడు2 వ‌స్తుండ‌డంతో మూవీపై అంచ‌నాలు ఓ రేంజ్‌లో ఉన్నాయి. అయితే ఈ సినిమా ఎందుకు చూడాల‌ని ప్ర‌శ్న త‌లెత్తితే ఈ ఐదు ప్ర‌త్యేక‌త‌ల కోసం అయిన మూవీని చూడాల్సిందేనంటున్నారు. ఇందులో ముందుగా శంక‌ర్ మార్క్ గ్రాండ్ విజువ‌ల్స్. ఆయ‌న సినిమా చూస్తే మ‌రో కొత్త ప్ర‌పంచ‌లోకి వెళ్లిన ఫీలింగ్ క‌లుగుతుంది. ఆడియ‌న్స్‌ని సీట్లో క‌ద‌ల‌కుండా చేయ‌గ‌ల స‌త్తా శంక‌ర్‌ది. యాక్షన్ ఎపిసోడ్స్, ఎమోషన్స్ సినిమాలో పుష్క‌లంగా ఉంటాయి. భారతీయుడు 2 లో ఆ రేంజ్లో ఆకట్టుకునే అంశాలు ఉంటాయనేది ప్రేక్ష‌కుల న‌మ్మ‌కం. రెండోది చూస్తే..‘భారతీయుడు’ లో ప్రభుత్వ ఉద్యోగులు , డాక్టర్లు… లంచగొండులపై భారతీయుడు చేసిన పోరాటాన్ని చూపించారు. ఇప్పుడు ‘భారతీయుడు 2’లో ఎలాంటి ఇష్యూ పై సేనాపతి ఫైట్ చేస్తాడు అనేది ఆస‌క్తిని పెంచింది.

భార‌తీయుడు2కి అనిరుథ్ సంగీతం అందించ‌గా, అత‌ను బ్యాక్ గ్రౌండ్ స్కోరు వీర‌లెవ‌ల్‌లో ఇచ్చి ఉంటాడ‌ని విశ్వ‌సిస్తున్నారు. రెహమాన్ లేని లోటుని అనిరుథ్ తప్ప‌క‌ తీరుస్తాడనే నమ్మకం కూడా అందరిలో ఉంది. ఇక భార‌తీయుడు 2లో క‌మ‌ల్ హాస‌న్‌తో పాటు సిద్ధార్థ్ (Siddharth) , రకుల్ ప్రీత్ సింగ్ (Rakul Preet Singh) ,కాజల్, బాబీ సింహా(Bobby Simha), ఎస్.జె.సూర్య(S. J. Suryah).. ఇలా చాలా మంది స్టార్ క్యాస్టింగ్ ఉంది. వారి పాత్ర‌ల‌కి ఎలాంటి ప్రాముఖ్య‌త ఉంటుంది, ఎవ‌రెవ‌రు ఏయే పాత్ర‌ల‌లో క‌నిపించి మెప్పిస్తారు, ‘భారతీయుడు 3′ కి లీడ్ ఇచ్చే పాత్రలు ఏంటి అనే దానిపై కూడా అంద‌రిలో ఆస‌క్తి ఉంది. వీటి కోసం అయిన భార‌తీయుడు 2 తప్ప‌క చూసే అవ‌కాశం ఉంది.