OTT: ప్రతి వారం కూడా ఓటీటీలో ప్రేక్షకులకి మంచి వినోదం దక్కుతుంది. ఒకవైపు థియేటర్లో సినిమాల సందడి ఉంటుండగా, మరోవైపు ఓటీటీలోను మంచి ఎంటర్టైన్మెంట్ ఉంటుంది. ఏప్రిల్ మొదటి వారంలో ప్రేక్షకులకి కావల్సినంత ఎంటర్టైన్మెంట్ అందగా, రెండో వారం కూడా మంచి వినోదం అందనుంది. అయితే ఈ వారం థియేటర్లో సందడి చేయనున్న సినిమాల విషయానికి వస్తే.. బాలీవుడ్ కథానాయకుడు అజయ్ దేవగణ్ భారత ఫుట్‌బాల్ దిగ్గజ కోచ్ సయ్యద్ అబ్దుల్ రహీంగా నటించిన ‘మైదాన్’ మూవీ ఏప్రిల్ 10న ఈ మూవీ ప్రేక్షకుల ముందుకు రాబోతుంది.ఇక బాలీవుడ్ కథానాయకులు అక్షయ్‌కుమార్, టైగర్ ష్రాఫ్ కలిసి నటించిన చిత్రం ‘బడేమియా ఛోటేమియా’ కూడా ఏప్రిల్ 10న థియేటర్లో సందడి చేయనుంది. ఇక అంజలి ప్రధాన పాత్రలో నటించిన ‘గీతాంజలి మళ్లీ వచ్చింది’ మూవీ ఏప్రిల్ 11న ప్రేక్షకులను పలకరించనుంది. విజయ్ ఆంటోనీ కథానాయకుడిగా నటిస్తూ, స్వయంగా నిర్మిస్తున్న చిత్రం ‘లవ్ గురు’.. రంజాన్ సందర్భంగా ఏప్రిల్ 11న చిత్రం ప్రేక్షకుల ముందుకు రాబోతుంది. ఇక ఓటీటీలోను వైవిధ్యమైన సినిమాలు ప్రేక్షకులని అలరించబోతున్నాయి.