Janhvi Kapoor| అంబానీ వెడ్డింగ్‌లో ధ‌రించిన డ్రెస్‌తో ఎన్టీఆర్ చిత్రాన్ని జాన్వీ భ‌లే ప్ర‌మోట్ చేస్తుందిగా..!

Janhvi Kapoor| ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో జూలై 12న అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్

  • By: sn    cinema    Jul 15, 2024 6:33 AM IST
Janhvi Kapoor| అంబానీ వెడ్డింగ్‌లో ధ‌రించిన డ్రెస్‌తో ఎన్టీఆర్ చిత్రాన్ని జాన్వీ భ‌లే ప్ర‌మోట్ చేస్తుందిగా..!

Janhvi Kapoor| ప్రముఖ వ్యాపార వేత్త, రిలయన్స్ ఇండస్ట్రీస్ అధినేత ముఖేష్ అంబానీ చిన్న కుమారుడు అనంత్ అంబానీ వివాహం ప్రముఖ వ్యాపారవేత్త వీరేన్ మర్చంట్ కుమార్తె రాధిక మర్చంట్‌తో జూలై 12న అంగ‌రంగ వైభ‌వంగా జ‌రిగిన విష‌యం తెలిసిందే. ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ సెంటర్ లో జ‌రిగిన వివాహ‌నికి దేశ విదేశాల నుండి ప‌లువురు ప్ర‌ముఖులు హాజ‌ర‌య్యారు. తారా లోకం తరలి రావ‌డంతో ఆ ప్రాంతం అంతా సంద‌డి వాతావ‌రణం నెల‌కొంది. టాలీవుడ్ నుంచి కూడా చాలా మంది సెల‌బ్రిటీలు హాజ‌రై సంద‌డి చేశారు. రామ్ చరణ్ ఫ్యామిలీ, మహేష్ బాబు ఫ్యామిలీ, దగ్గుబాటి రానా ఫ్యామిలీ ఇలా ప‌లువురు ప్ర‌ముఖులు వేడుక‌లో హంగామా చేశారు.

ఇక బాలీవుడ్ నుంచి స్టార్ కాస్ట్ మొత్తం దిగేసింది. వీరిలో దివంగత నటి శ్రీదేవి తనయ, స్టార్ హీరోయిన్ జాన్వీ కపూర్ కూడా ఉంది. అయితే పెళ్లిలో ఆమె ధ‌రించిన గోల్డ్ క‌ల‌ర్ లెహంగా అందరి దృష్టిని ఆక‌ర్షించింది. స్టైలిష్ లుక్‌లో జాన్వీ క‌పూర్‌ని చూసి అదుర్స్ అని ప్ర‌శంస‌లు కురిపించారు.ఇక జాన్వీ క‌పూర్ పెళ్లి వేడుక‌లో ధ‌రించిన డ్రెస్‌తో సోష‌ల్ మీడియాలు ప‌లు ఫోటోలు షేర్ చేసింది. వయ్యారాల విందుతో కుర్రకారును తెగ అట్రాక్ట్ చేస్తూ ఈ అమ్మ‌డు చేసిన అందాల ప్ర‌ద‌ర్శ‌న‌కి ప్ర‌తి ఒక్క‌రు మైమ‌ర‌చిపోతున్నారు. లేలేత అందచందాలతో రోజుకు రోజుకు డోస్ పెంచేస్తూ మైమరిపిస్తుంది అంటూ కామెంట్స్ చేస్తున్నారు.

అయితే జాన్వీ కపూర్ ప్రస్తుతం ఎన్టీఆర్ సరసన దేవర చిత్రంలో నటిస్తోంది. ఈ మూవీ పాన్ ఇండియా చిత్రంగా రిలీజ్ అవుతున్న నేప‌థ్యంలో దేవ‌ర చిత్రాన్ని ఎక్కువ‌గానే ప్ర‌మోట్ చేస్తుంది. చిత్రంలో జాన్వీ క‌పూర్ ‘తంగం అనే పాత్ర పోషిస్తుంది. ఈ క్ర‌మంలో తన పాత్ర బాగా రీచ్ అయ్యేలా జాన్వీ కపూర్ సోషల్ మీడియాలో ప్రమోషన్స్ షురూ చేసింది.. అంబానీ వెడ్డింగ్ కి ధరించిన ఫోటోలు సోషల్ మీడియాలో షేర్ చేస్తూ ‘తంగం’ అనే హ్యాష్ ట్యాగ్ పెట్టి ఒక్క‌సారిగా అంద‌రి దృష్టి త‌నపై ప‌డేలా చేసింది. జాన్వీ తెలివితేట‌లు చూసి అంద‌రు ప్ర‌శంస‌ల వ‌ర్షం కురిపిస్తున్నారు.