Janhvi Kapoor| తెలుగులో జాన్వీ కపూర్ హవా మాములుగా లేదుగా.. మరో సినిమా ఆఫర్ అందుకుందా?
Janhvi Kapoor| శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు తన అందచందాలతో కుర్రాళ్లని ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది.

Janhvi Kapoor| శ్రీదేవి ముద్దుల తనయ జాన్వీ కపూర్ గురించి ప్రత్యేక పరిచయాలు అక్కర్లేదు. ఈ అమ్మడు తన అందచందాలతో కుర్రాళ్లని ఎంతగానో అట్రాక్ట్ చేస్తుంది. దఢఖ్ సినిమాతో ఇండస్ట్రీకి వచ్చిన ఈ భామ ఆ తర్వాత వైవిధ్యమైన సినిమాలు చేస్తూ ప్రేక్షకులని అలరిస్తుంది. ఇక మొన్నటి వరకు నార్త్‌లో అలరించిన ఈ భామ ఇప్పుడు తెలుగులో వరుస అవకాశాలు అందిపుచ్చుకుంటూ తెగ రచ్చ చేస్తుంది. ఎన్టీఆర్ సరసన దేవర అనే చిత్రంలో జాన్వీ కపూర్ కథానాయికగా నటిస్తున్న విషయం తెలిసిందే. ఇక రామ్ చరణ్- బుచ్చిబాబు క్రేజీ ప్రాజెక్ట్‌లో కూడా జాన్వీనే కథానాయికగా ఎంపిక చేశారు. ఇక ఇప్పుడు నాని చిత్రంలోను జాన్వీ హీరోయిన్‌గా ఎంపికైనట్టు తెలుస్తుంది.
శ్రీకాంత్ ఓదెల, నాని కాంబోలో దసరా అనే చిత్రం తెరకెక్కగా ఈ మూవీ ఎంత పెద్ద హిట్ అయిందో మనకు తెలిసిందే. చిత్రంలో నాని చాలా మాస్‌గా చూపించాడు. దసరాతో శ్రీకాంత్ ఓదెల, నాని పెద్ద బ్లాక్ బస్టర్ కొట్టేశారు. ఇక ఇప్పుడు శ్రీకాంత్ రెండో ప్రాజెక్ట్ కూడా నానితోనే ఉండబోతోంది. నాని ప్రస్తుతం సరిపోదా శనివారం సినిమా చేస్తున్నాడు. ఈ మూవీ కాకుండా బలగం వేణు, సుజిత్, శ్రీకాంత్, శైలేష్ కొలను వంటి దర్శకులతో సినిమాలు చేయనున్నాడు. త్వరలో హిట్ 3ని కూడా సెట్స్ మీదకు తీసుకొచ్చేందుకు ప్రయత్నిస్తున్నాడు.అయితే నాని- శ్రీకాంత్ కాంబోలో రూపొందనున్న ప్రాజెక్ట్‌పై ఇప్పుడు అందరి దృష్టి ఉంది.
ఈ ప్రాజెక్ట్‌లో నాని సరసన జాన్వీ కపూర్ నటిస్తుందని తెలుస్తుంది.. ఈ మేరకు నెట్టింట్లో వార్తలు చక్కర్లు కొడుతున్నాయి. మరి జాన్వీ కపూర్ నిజంగానే నాని సినిమాకు ఓకే చెప్పిందా? లేదా? అన్నది తెలియాలంటే మరి కొద్ది రోజులు వెయిట్ చూడాల్సిందే. ఇటీవల జాన్వీ తెలుగు సినిమాలపైనే ఎక్కువగా ఫోకస్ చేసినట్టు తెలుస్తుంది. జాన్వీ కపూర్‌కు మొదటి కమర్షియల్ హిట్ తెలుగులోనే వచ్చేలా ఉంది. దేవర మంచి హిట్ కొడితే జాన్వీ ఫేట్ మారిపోవడం ఖాయం అని చెప్పవచ్చు.