Peddi Movie Update | ‘పెద్ది’ షూటింగ్ నుంచి కీలక అప్డేట్

రామ్ చరణ్ జాన్వీ కపూర్ జంటగా తెరకెక్కుతున్న ‘పెద్ది’ షూటింగ్ 60% పూర్తైంది. పూణెలో పాట చిత్రీకరణకు చిత్రబృందం సిద్ధం.

Peddi Movie Update | ‘పెద్ది’ షూటింగ్ నుంచి కీలక అప్డేట్

విధాత : మెగా హీరో రాంచరణ్..అందాల తార జాన్వీ కపూర్ జంటగా బుచ్చిబాబు దర్శకత్వంలో రూపొందుతున్న ‘పెద్ది’ షూటింగ్ నుంచి కీలక ఆప్డేట్ వెలువడింది. సినిమా షూటింగ్ వేగంగా జరుగుతుందని..ఇప్పటికే 60శాతం షూటింగ్ పూర్తయ్యిందని.. ఫ‌స్ట్ ఆఫ్ లాక్ అయిపోయిందని చిత్ర బృందం సమాచారం. సినిమా అవుట్ పుట్ పై రామ్ చ‌ర‌ణ్ సూప‌ర్ హ్యాపీగా ఉన్నారని..రేప‌టి నుంచి పూణెలో చ‌ర‌ణ్ – జాన్వీ క‌పూర్‌ల‌పై పాట చిత్రీక‌ర‌ణ‌ జరుగనుందని వెల్లడించారు. ఈ పాటకు జానీ మాస్ట‌ర్ నృత్య‌రీతులు స‌మ‌కూరుస్తున్నారని..ఎఆర్. రెహ‌మాన్ అందించిన ట్యూన్ ఆకట్టుకునే విధంగా ఉందని…సినిమాలో ఈ పాట మ‌ళ్లీ మ‌ళ్లీ వినాల‌పించే పాట అవుతుంద‌ని చిత్ర బృందం టాక్.

స్పోర్ట్స్ బ్యాక్ డ్రాప్ లో తెర‌కెక్కుతున్న పెద్ది సినిమా వచ్చే సంవత్సరం మార్చి 27న రామ్ చరణ్ పుట్టినరోజు సందర్భంగా రిలీజ్ చేయబోతున్నట్టు మేకర్స్ తెలిపారు. దాదాపు రూ. 300 కోట్ల బడ్జెట్ తో తీస్తున్న ఈ సినిమాలో రామ్ చరణ్ సరసన జాన్వీ కపూర్ తో పాటు సీనియర్ హీరోయిన్ త్రిష కూడా ప్రత్యేక పాత్రలో కనిపించబోతున్నట్లు సమాచారం. విజయ్ సేతుపతి, శివరాజ్ కుమార్ కూడా సినిమాలో నటిస్తున్నారు. సినిమాలో రామ్ చరణ్‌ చాలా గంభీరమైన, మాస్ లుక్‌లో కనిపించనున్నారు. రామ్ చరణ్ డైలాగ్ మాడ్యూలేషన్ ఉత్తరాంధ్ర మాండలికంతో అభిమానులను ఆకట్టుకుంటాయంటున్నారు.