Rashmika Mandanna Opens On Kannada Ban Rumours | మా వ్యక్తిగత జీవిత విశేషాలు బయటకు తెలియవు
నటీనటుల వ్యక్తిగత జీవిత విశేషాలు బయటి ప్రపంచానికి పూర్తిగా తెలియవని రష్మిక మందనా అన్నారు. తనపై కన్నడ పరిశ్రమ నిషేధం వార్తలు ఫేక్ అని, 'కాంతార' టీమ్‌కు అభినందనలు చెప్పానని స్పష్టం చేశారు.

విధాత : ఇటీవలే హీరో విజయ్ దేవరకొండతో ఎంగేజ్మెంట్ చేసుకున్న నేషనల్ క్రష్ రష్మిక మందనా సినీ తారల వ్యక్తిగత జీవితం, కన్నడ సినీ పరిశ్రమ నిషేధం వంటి కీలక అంశాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. ఇందుకు సంబంధించిన పాత ఇంటర్య్వూ ఒకటి వైరల్ అవుతుంది. ఆ ఇంటర్వ్యూలో సినీ ప్రముఖుల జీవితంలో తెర వెనుక ఏం జరుగుతుందో ప్రపంచానికి పూర్తిగా తెలియదని రష్మిక ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. లోపల ఏం జరుగుతుందో ప్రపంచానికి తెలియదని.. మా వ్యక్తిగత జీవితాన్ని ఎప్పుడూ కెమెరాలో రికార్డ్ చేయలేం కదా అంటూ..మేము మా మెసేజ్‌లను, వ్యక్తిగత సంభాషణలను ఆన్‌లైన్‌లో పంచుకునే వ్యక్తులం కాదు అన్నారు. అందుకే ఒక వ్యక్తి జీవితం గురించి బయటివారు చెప్పే మాటలు పట్టించుకోనవసరం లేదు. కానీ మా వృత్తిపరమైన జీవితం గురించి వారు చెప్పే విమర్శలను తప్పకుండా పరిగణించి సమాధానం ఇస్తామని రష్మిక స్పష్టం చేశారు.
అవన్నీ ఫేక్ వార్తలు
కన్నడ సినీ పరిశ్రమలో తనను నిషేధించారన్న వార్తలపై రష్మిక నవ్వుకున్నారు. ఇప్పటివరకు, నన్ను ఎవరూ నిషేధించలేదు అని..అవన్నీ ఫేక్ వార్తలు మాత్రమే అని తేల్చి చెప్పారు. కళాకారులుగా ప్రజల అభిప్రాయాలకు అనుగుణంగా జీవించలేమని, విమర్శలు తరచుగా అపార్థాలు వంటివి అసంపూర్ణ జ్ఞానం..అరకొర సమాచారం నుంచే వస్తాయని ఆమె అభిప్రాయపడ్డారు. నాకు అన్ని వర్గాల ప్రేక్షకులు ఉన్నారని స్పష్టం చేశారు.
2016లో రష్మికను సినీ ప్రపంచానికి పరిచయం చేసిన చిత్రం ‘కిరిక్ పార్టీ’. దీనికి రిషబ్ శెట్టి దర్శకత్వం వహించారు. అయితే, రిషబ్ శెట్టి సినిమా ‘కాంతార’ విజయంపై అప్పట్లో రష్మిక ఆలస్యంగా స్పందించడం పట్ల సోషల్ మీడియాలో తీవ్ర విమర్శలు వచ్చాయి. ఈ విషయమై రష్మిక మందనా పాత ఇంటర్వ్యూ ఒకటి తాజాగా వైరల్ అవుతోంది. కాంతార సినిమా విడుదలైన తొలి రెండు మూడు రోజుల్లో నేను చూడలేదని..ఆ తర్వాత చూశాక వెంటనే చిత్రబృందానికి అభినందన సందేశం కూడా పంపానని..అందుకు వారు కూడా ‘ధన్యవాదాలు’ అని బదులిచ్చారు కూడా అని రష్మిక వివరించారు.